పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని చెబుతూ ఉంటారు.. అందుకే పెళ్లి ప్రతి ఒక్కరు ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక బంధుమిత్రులందరికీ సమక్షంలో పెళ్లి చేసుకొని  జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానించి ఎంతో ప్రేమగా చూసుకోవాలి అని ఎన్నో కలలు కంటూ ఉంటారు.  ఇక అందమైన భార్య వస్తే అంతకంటే అదృష్టం ఇంకేం ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇలా మీరు అందమైన భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ ఒక అందమైన యువతి పెళ్లికి రెడీ గా ఉంటుంది.



 అదేంటి ముక్కు మొఖం తెలియని యువతి మమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అని ఆశ్చర్య పోతున్నారు కదా.. ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అంటే.. ఆ యువతికి అదే పని కాబట్టి..  పాపం ఆ యువతి జీవనాధారం కూడా పెళ్లే కావడం గమనార్హం.. ఎలా అంటారా ఆమె నిత్య పెళ్లి కూతురు. ఏకంగా పెళ్లి చేసుకోవడం కొన్నాళ్ళపాటు వ్యక్తితో జీవించడం ఆ తర్వాత ఇంట్లో ఉన్న నగలు నగదు అన్ని తీసుకొని పారిపోవడం  ఆ యువతి స్టైల్.  ఇక ఇలా నగలు నగదు దొంగలించడం టార్గెట్గా పెట్టుకుని ఏకంగా ఎంతో మందిని పెళ్లి చేసుకుంటూ వస్తుంది ఆ యువతి.



 ఇక ఇప్పటి వరకు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 12 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసింది ఈ కిలాడి. ఇక ఇటీవలే యువతిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. చూసేందుకు ఎంతో అందంగా ఉండే లడ్డూ అలియాస్ నేహా అనే యువతి కొందరితో కలిసి గ్యాంగ్ గా ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒక యువకుడిని పెళ్లి చేసుకొని కొంతకాలం వరకు వరుడితో  గడుపుతుంది. దాని తర్వాత వారి ఇంట్లో నగలు నగదు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకుంటుంది. ఇక ఆ తర్వాత ప్లాన్ ప్రకారం అన్ని తీసుకొని  ఉడాయిస్తుంది.  ఇటీవలే రాజస్థాన్లో జైరాం అనే వ్యక్తిని జూన్ 9న  పెళ్లి చేసుకుంది ఇక భర్తతో ఎంతో సంతోషం గానే ఉంటుంది. కానీ అంతలో తన ప్లాన్ అమలు చేసింది. ఇంట్లో వారందరికీ కాఫీ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఇంట్లో ఉన్న నగలు నగదు తీసుకుని పారిపోయింది. ఇక పోలీసులకు ఫిర్యాదు అందడంతో చివరికి ఈ కిలేడి ని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: