ప్రేమ అనేది ఎప్పుడు ఎవ‌రి మ‌ధ్య పుడుతుందో.. ఎవ‌రి మ‌ధ్య వైరం పెంచుతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. కొంత‌మంది  ప్రేమిచుకున్నవారు ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహం  చేసుకుంటారు. మ‌రికొంద‌రూ  ఇంట్లో నుంచి పెద్దల‌ను కాద‌ని వెళ్ళిపోయి వారే స్వ‌యంగా నూత‌న‌ జీవితాన్ని గ‌డుపుతుంటారు. మరికొందరు తమ ప్రేమ దక్కడం లేదని ఆత్మహత్యకు సైతం  పాల్ప‌డుతారు.  అయితే ఇక్కడ జరిగిన ఘటనను దారుణం అనాలో విషాదం అనాలో మాత్రం అసలు తెలియడం లేదు. ప్రేయసితో పెళ్లి కోసం ప్రియుడు అది ఒక చిన్న అబద్దం వారి జీవితాలను అతలాకుతలాం చేసిన‌ది. ప్రియుడు మృతి చెందాడని అనుకున్న ప్రేయసి ముందు వెనుక ఆలోచించకుండా బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలను వదిలేసింది.  

ఈ ఘటన బెంగుళూరులో ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివరాల్లోకి వెళితే హసన్ జిల్లాలోని చన్నారాయపట్నానికి చెందిన సాకమ్మ(24) యశ్వంత్పుర్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న‌ది. అక్కడే ఆమెకు అరుణ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.  ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి..  వీరిద్దరి ప్రేమ‌ను పెద్ద‌లు ఒప్పుకోక‌పోవ‌డంతో  పెళ్లికి  ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. కొద్ది రోజులు బ్ర‌తిమిలాడ‌గా.. అరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకునేందుకు అంగీక‌రించ‌గా..   సాకమ్మ తల్లిదండ్రులు మాత్రం ససేమిరా అన్నారు.   అరుణ్ తన ప్రేయసితో పెళ్లి కోసం ఒక దారుణమైన ప్లాన్ వేసాడు.

తన ఫ్రెండ్ గోపాల్ చేత సాకమ్మ తల్లికి, బావకు పోలీస్ లా ఫోన్ చేయించి అరుణ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని,  దానికి కారణం మీరే అని,  మీ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయండి  లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామ‌ని చెప్పించాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సాకమ్మ.. తన కోసం ప్రియుడు మృతిచెందాడనుకొని..  తాను లేని జీవితం నాకు వద్దని ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన‌ది. అరుణ్తో పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదని.. తాను లేకుండా నేను బతకలేనని లేఖలో పేర్కొని ప్రాణాలు కోల్పోయింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.







మరింత సమాచారం తెలుసుకోండి: