సాధారణంగా మనం చూసినంత వరకు సైకో ప్రేమికుడు ప్రియురాలిని హత్య చేశాడం లాంటివి చూస్తుంటాము. కానీ ఈ సారి అందుకు భిన్నంగా ప్రియుడిపై ప్రియురాలే కత్తితో దాడి చేసింది. ప్రస్తుతం నేటి సమాజంలో ప్రేమ పేరుతో దగ్గరై, లైంగిక వాంఛలు తీర్చుకున్నాక ముఖం చాటేయాలని చూసిన బాయ్ ఫ్రెండ్ ని ఆమె గమనించింది. దాంతో తనకు జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకునేందకు నేరం చేయడానికీ వెనుకాడలేదు ఆమె. ఇక ఆ మహిళ నిర్దాక్షణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌజ్ ప్రాంతంలో, లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాలోకి వెళ్తే.. హైదరాబాద్ సిటీకి చెందిన ఓ యువ జంట కొంతకాలంగా ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకుంటున్నారు. ఈ తరుణంలో వారి మధ్య శారీరక బంధం కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని నెలలుగా సాగుతోన్న ప్రేమ వ్యవహారంలో ఇటీవల పొరపొచ్చలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక లవర్స్ మధ్య మనస్పర్థలు పెద్దవిగా మారాయి.

అయితే అమ్మాయిని శారీరకంగా అనుభవించిన తర్వాత ప్రేమ వర్కౌట్ కావట్లేదంటూ యువకుడు ఆమెను దూరం పెట్టాడు. అంతేకాదు.. అతని చేతిలో మోసపోయానని భావించిన ఆ యువతి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. కాగా.. మోసం చేశాడనే కోపంతో ప్రేమికుడిపై దాడి చేసిన యువతి అతణ్ని కత్తితో కసకసా పొడించింది. దాంతో రక్తపు మడుగులో పడిఉన్న యువకుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారం మేరకు.. ప్రియురాలి దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తస్తావం అవుతుండగా స్థానికులు అప్రమత్తమై ఆ యువకుడిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పోలీసులు స్థానికుల నుండి సమాచారం తీసుకున్నారు. అనంతరం చికిత్స పొందుతోన్న యుకుడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం. ఇక అతనిని కత్తితో పొడిచిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: