ఇటీవలి కాలంలో మనుషులు చిన్నచిన్న విషయాలకే చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ ఊహించని విధంగా షాకిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆత్మహత్య చేసుకుంటామంటూ సెల్ టవర్ ఎక్కి ఎంతోమంది హల్చల్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటివరకు భార్యాబాధితుల ఎంతోమంది.. పుట్టింటికి  వెళ్లిన తన భార్య కాపురానికి రావడం లేదు అని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటామంటూ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. ఇలా అందరినీ బెదిరించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి ఇటీవల టవర్ మీద నుంచి జారి పడి చివరికి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది.


 ఇక్కడ ఒక వ్యక్తి ఇలాగే టవర్ ఎక్కి హల్ చల్ చేశాడూ. అయితే ఇతను భార్య బాధితుడు కాదు ఉద్యోగం పోయిన వ్యక్తి. సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం పోయింది అంటే చాలు మరో ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదంటే తనను ఉద్యోగం నుంచి తీసేయడానికి కారణం ఏమిటి అంటూ నిలదీస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఉద్యోగం పోయింది అని మనస్థాపం చెంది చివరికి విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకుంటా అంటూ హల్చల్ చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.. కామారెడ్డి మున్సిపాలిటీ లో పని చేస్తున్న తనను అకారణంగా విధుల నుంచి తొలగించారని పారిశుద్ధ్య కార్మికులు పురుషోత్తం  టవర్ ఎక్కి హల్ చల్ చేశాడూ..

 పాత రాజం పేట గ్రామానికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే తమ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కుట్రపూరితంగా వ్యవహరించి  తనను విధుల నుంచి తొలగించేలా చేశారంటూ పురుషోత్తం ఆరోపిస్తున్నాడు. వెంటనే తనని వీధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఇక ఏకంగా హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఇక సమాచారం  అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినిపించకపోవడంతో ఇక అటువైపుగా వెళుతున్న ఆర్డీవో వచ్చి నచ్చజెప్పి న్యాయం చేస్తాను అంటూ హామీ ఇవ్వడంతో చివరికి టవర్ నుంచి కిందికి దిగాడు పురుషోత్తం.

మరింత సమాచారం తెలుసుకోండి: