ఈ ఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తాడేపల్లి లో వెలుగులోకి వచ్చింది. అజయ్ సాయి అనే వ్యక్తి చల్లపల్లి ఫణి కృష్ణ స్నేహితులు.ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే పార్టీ చేసుకున్న సమయంలో అజయ్ భార్యపై ఫణి కృష్ణ అసభ్యంగా మాట్లాడాడు. అలా మాట్లాడకు అని ఎంత చెప్పినా వినక పోవడంతో చివరికి అతన్ని చంపాలని కక్ష పెంచుకున్నాడు అజయ్ సాయి. ఈ క్రమంలోనే ఇక గోవా వెళ్దామని అతన్ని తీసుకెళ్ళినా అజయ్.. తన అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్నా శ్రీ మంజునాథ హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన ఒక వెంచర్ లోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య చేసాడు.
అనంతరం ముందుగా తన వెంట తెచ్చుకున్నా డీజిల్ అతనిపై పోసి మృతదేహాన్ని తగలబెట్టాడు. ఆ తర్వాత కార్ ను పొందుగల చెక్పోస్టు వద్ద వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని అజయ్ సాయి తల్లి తన కొడుకు సాయి అతని స్నేహితుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండేళ్లుగా ఈ కేసును ఛేదించేందుకు అన్ని విధాల ప్రయత్నించారు. అయితే చివరికి అజయ్ ఆచూకీ హైదరాబాద్లో దొరకడంతో చిక్కుముడి వీడింది. ఈ క్రమంలోనే పోలీసులు తమదైన శైలిలో విచారించగా భార్య గురించి అసభ్యంగా మాట్లాడినందుకే స్నేహితుడినీ హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి