ఆడపిల్లలకు రక్షణ కల్పించేందుకు ఏది కఠిన చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడంలేదు. మానవత్వంతో సాటి మనుషులకు సహాయంచేసే గుణం తో ఉండాల్సిన మనుషులు కామంతో ఊగిపోతూ మానవ మృగాలుగా మారిపోతున్నారు. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇచ్చిన మనుషులు ఇక ఇప్పుడు క్షణకాల  సుఖం కోసం ఆ బంధాలని కాలరాస్తూ నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రోజురోజుకు ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని దారుణమైన శిక్షలు విధించినా ఎందుకో కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. దీంతో ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది.  అయితే ఇటీవలి కాలంలో ఆడపిల్లలపై బలవంతంగా అత్యాచారాలు చేస్తున్న వారి కంటే.. మంచి వాళ్ళలా నటించి సమయం సందర్భం కోసంవేచి చూసి ఇక మాయమాటలతో లోబర్చుకుని అత్యాచారాలు చేస్తున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఒక ఎంతో మంది కామాంధులకు ప్రేమ అనేది అవసరాలు తీసుకునే ఒక ఆయుధంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పిన యువకుడు చివరికి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో నాలుగు రోజుల కిందట మాయమాటలు చెప్పి బయటకు తీసుకు వెళ్ళాడు సాత్విక్ అనే యువకుడు. ఈ క్రమంలోనే అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం లోని పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: