
ఎంతోమంది మోసగాళ్లు ప్రేమ అనే ముసుగు వేసుకుని మంచి వాళ్ళలా ప్రవర్తిస్తూ చివరికి ఎంతో మంది అమ్మాయిలను మోసం చేస్తున్నారు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను నీతోనే నా జీవితం మొత్తం అంటూ మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపి చివరికి అవసరాలు తీర్చుకుని నడిరోడ్డు మీద వదిలేస్తున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. దీంతో ఎంతో మంది యువతులు న్యాయ పోరాటం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా సంఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. హైదరాబాద్లోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో నమ్మించి ఓ యువతి పై శారీరక వాంఛలు తీర్చుకుని గర్భవతిని చేశాడు ప్రియుడు.
చివరికి పెళ్లి చేసుకోమని ప్రశ్నిస్తే ముఖం చాటేసి పరారయ్యాడు. ఆమనగల్లు కు చెందిన మహేష్ కు శంషాబాద్ చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. కాగా ప్రేమిస్తున్నానంటూ ఆ యువతి వెంటపడ్డాడు మహేష్. పెళ్లి చేసుకొని ఆనందంగా జీవిద్దాం అంటూ మాయమాటలతో ముగ్గులోకి దింపాడు. చివరికి శారీరక వాంఛ తీర్చుకోవడం తో ఆమె గర్భం దాల్చింది. ఇటీవలే మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే పెళ్లి చేసుకోవాలంటూ మహేష్ ను అడిగితే ఇక ముఖం చాటేసి ఆచూకీ తెలియని చోటికి పారిపోయాడు. ఇక మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.