
ఒక యువతిని ప్రేమించిన యువకుడు ఐ లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ఇక నిన్నే పెళ్లి చేసుకుంటాను నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ ఆమెను నమ్మించాడు. ఇక కాబోయే భర్త కదా అని ఆమె సర్వస్వం అతనికి అర్పించింది. ఈ క్రమంలోనే శారీరక కోరికలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్ళి విషయం ఎత్తగానే ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. ప్రియుడు పెళ్లి చేసుకుంటాడని ఎన్నో రోజులు ఎదురు చూసిన యువతీ చివరికి మోసపోయాను అని గ్రహించింది. చివరికి జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో బాధిత కుటుంబం పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. ఫిరోజాబాద్ కు చెందిన 24 ఏళ్ల యువతికి అమిత్ యాదవ్ అనే కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. యువతిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటా అంటూ వెంట పడ్డాడు అమిత్ యాదవ్. పోలీసు కావడంతో అతని మాటలు కూడా నమ్మింది యువతి. ఈ క్రమంలోనే తర్వాత పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకో మంటే కట్నం భారీగా కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఎక్కువ చేస్తే చంపేస్తామని బెదిరింపులు కూడా పాల్పడుతున్నాడు. ఇక బాధిత కుటుంబం ఉన్నతాధికారులు ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.