ఏంటో మనుషుల ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది నేటి రోజుల్లో. ఎందుకంటే ఏ విషయంలో ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియని విధంగా మారిపోయింది. ముఖ్యంగా చిన్న చిన్న కారణాలకే దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. కేవలం ఒకే దేశంలో మాత్రమే కాదు ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ఇలాంటి ఉన్మాదమే కనిపిస్తూ ఉంది. చిన్న చిన్న కారణాలకే ఎదుటి వారి ప్రాణాలను తీస్తున్నారు.


 ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే రానున్న భవిష్యత్తు ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో అని ప్రతి ఒక్కరు తలుచుకుని భయపడిపోతున్నారు అని చెప్పాలి. సొంత వారు పరాయివాళ్ళు అనే తేడా లేకుండా మనిషిలో ఉండే మానవత్వాన్ని పూర్తిగా తుంగలో తొక్కేసి జాలి దయ లేకుండా సాటి మనుషుల ప్రాణాలను దారుణంగా తీసేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే థాంక్స్ చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎవరైనా ఇలా థాంక్స్ చెప్పకపోతే పోనీలే అని ఊరుకుంటారు సహాయం చేసిన వారు.


 కానీ ఇక్కడ మాత్రం థాంక్స్ చెప్పడం విషయంలో జరిగిన చిన్నపాటి గొడవలు చివరికి ఒక దారుణానికి కారణమైంది. ఏకంగా ఒక మనిషి ప్రాణాలను గాల్లో కలిసి పోయేలా చేసింది. థాంక్స్ అడగడం  ఒక వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. అమెరికాలోని బ్రూక్లిన్ లో షాప్ ఉద్యోగి అక్కడికి వచ్చిన కస్టమర్ కోసం డోరు తీశాడు. డోర్ తీసిన సమయంలో కస్టమర్ థాంక్స్ చెప్పకుండానే వెళ్ళి పోయాడు. కానీ ఇది ఆ ఉద్యోగి నచ్చలేదు. ఇక అదే విషయంపై అతడిని ప్రశ్నించాడు. నేను నిన్ను డోర్ తీయమని అడగలేదు కదా.. ఇక థాంక్స్ ఎందుకు చెబుతా అంటూ నిందితుడు  ఉద్యోగితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే  ఉద్యోగిని కత్తితో కడుపు గొంతు భాగంలో పొడిచి  అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన సదరు ఉద్యోగి చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: