ఈ మధ్యకాలంలో భార్యాభర్తల బంధం అనేది ఎన్నో దారుణాలకు కారణమవుతోంది అని చెప్పాలి. ఎందుకంటే అన్యోన్యంగా ఉంటూ కష్టసుఖాలలో పాలుపంచుకోవాల్సిన భార్యాభర్తలు చిన్న కారణాలకె బద్ధ శత్రువు లాగా  వ్యవహరిస్తూ ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి కూడా సిద్ధమైపోతున్నారు అని చెప్పాలి. వెరిసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఎన్నో ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే  వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 పుట్టింటి నుంచి రాను అని చెప్పిన కారణంగా భర్త దారుణంగా వ్యవహరించాడు. ఏకంగా కష్టసుఖాల్లో తోడు ఉంటూ భార్యకు ఏ సమస్య రాకుండా చూసుకోవాల్సిన భర్త చివరికి భార్యా పాలిట యమకింకరుడిగా మారిపోయాడు. పట్టపగలే భార్యపై పెట్రోల్ పోసి పుట్టింటి దగ్గరే సజీవ దహనం చేయాలని ప్రయత్నించాడు. అయితే మంటల్లో కాలిపోతూ హహాకారాలు చేస్తున్న మహిళను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించగా చివరికి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది బాధితురాలు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.


 సేహోర్ లోని కస్బా చౌకి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల దీక్ష 2016లో ఉజ్జయినికి చెందిన రాజేష్ ని వివాహం చేసుకుంది. వీరికి పిల్లలు లేరు. అయితే భార్యాభర్తల మధ్య కొద్ది రోజుల క్రితమే వివాదాలు తలెత్తడంతో తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే రాజేష్ భార్యను కొడుతూ ఉండడంతో ఆమె వేధింపులు భరించలేక చివరికి పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఉంది. అయితే తనతో పాటు రావాలి అంటూ తరచూ ఆమెపై ఒత్తిడి చేసేవాడు రాజేష్. ఇక ఇటీవల 15 రోజుల క్రితం దీక్ష ఇంటికి వెళ్లి దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలోనే సదరు మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కోపంతో ఊగిపోయిన రాజేష్ మళ్ళీ పుట్టింటికి వెళ్లి భార్యతో గొడవ పడి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు అంటించి అక్కడ నుంచి పారిపోయాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు  మంటలు ఆర్పేసి చివరికి ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: