సాధారణంగా ఒక మనిషికి ఏదైనా అవసరం పడినప్పుడు సాటి మనుషులు సహాయం చేయడం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. దానినే మానవత్వం అని కూడా ఒక గొప్ప పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇటీవల కాలం లో చూసుకుంటే ఇలాంటి మానవత్వం మనుషుల్లో కనబడకుండా పోయింది అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే మంచి వాళ్ళలా నటిస్తున్న వారు ఏకంగా మానవత్వం తో మెలగకుండా దారుణం గా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి.


 సమయం సందర్భం చూసి మనసులో ఉన్న దుర్బుద్ధిని బయట పెడుతున్నారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి.  ఒక మహిళ ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంది.  అవసరానికి అప్పు ఇవ్వడం తో అతను మంచివాడే అని అనుకుంది. అయితే ఈ క్రమం లోనే అప్పు తీసుకున్న మొత్తాన్ని మళ్లీ తిరిగి ఇవ్వడానికి వెళ్ళింది. అవసరానికి ఆదుకొని మంచి వాడిలా ఉన్న అతడు దుర్బుద్ధిని బయట పెట్టాడు. తాను ఇచ్చిన డబ్బు వద్దు అని చెప్పాడు. కానీ కోరిక తీర్చాలి అంటూ వేధించడం మొదలుపెట్టాడు.


 బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించిన చివరికి ఉపయోగం లేకుండా పోయింది. ఏపీ వైయస్సార్ కడప జిల్లా వేంపల్లి లో వెలుగులోకి వచ్చింది. నాగమ్మ అనే మహిళ అవసరాల కోసం సుబ్బరాయుడు అనే వ్యక్తి దగ్గర 1,60,000 రూపాయలు  రెండు సంవత్సరాల క్రితం అప్పుగా తీసుకుంది. ఇక ఇటీవలే నగదు సర్దుబాటు కావడంతో తిరిగి చెల్లించేందుకు వెళ్ళింది. అయితే నాకు డబ్బులు అవసరం లేదని చెప్పాడు. అదేంటి అని ప్రశ్నిస్తే దుర్బుద్ధిని బయట పెట్టాడు. తన కోరిక తీర్చాలి అంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే సదరు మహిళను రెండుసార్లు కిడ్నాప్ చేశాడు.  కుమారుడి పై కత్తితో దాడి చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని సదరు బాధిత మహిళ వాపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: