ఇటీవల కాలంలో మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకు వస్తుంది అన్నది ఊహకంగానే ఉంటుంది. అంతా సవ్యంగానే ఉంది అనుకుంటున్న సమయంలో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఊహించని రీతిలో మృత్యువు కబళిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు నేటి రోజుల్లో ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపేస్తూ ఉన్నాయి. ఇక ఇటీవల చతిస్గడ్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఇంకొన్ని రోజులు అయితే తన కడుపులో ఉన్న బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అని ఆ మహిళ ఎంతో ఆనందంలో ఉంది. కానీ ఆమె ఆనందాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది.


 దీంతో విద్యుదఘాతం రూపంలో ఇక తొమ్మిది నెలల నిండు గర్భిణీని మృత్యువు  కబళించింది అని చెప్పాలి. దీంతో ఇక ఆ గర్భిణీ అక్కడికక్కడే మరణించింది. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది అని చెప్పాలి. ఏకంగా గర్భిణీ మరణించిన తర్వాత కూడా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గుండె కొట్టుకుంటూనే ఉండడం గమనార్హం. దీంతో చిన్నారిని కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించారు వైద్యులు. కానీ ఆపరేషన్ చేసే సమయంలో చివరికి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.


 ఉదయపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్దపుట గ్రామానికి చెందిన 28 ఏళ్ల శివకుమారి 9 నెలల నిండు గర్భవతి. అయితే ఇటీవల స్నానం చేసి బాత్రూం నుంచి బయటకు వస్తుండగా.. చేతిలో ఉన్న తడి బట్టను బయట ఉన్న వైరు పై ఆరవేయడం ప్రారంభించింది. ఇంతలో కరెంట్ షాక్ కి గురైంది. అయితే నిజానికి అది ఒక మామూలు ఇనుప తీగ  మాత్రమే. అందులో కరెంటు ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఇక తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్న శివకుమారి అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించింది. అప్పటికి కడుపులో ఉన్న బిడ్డ గుండె మాత్రం కొట్టుకుంటూ ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసేందుకు ప్రయత్నించిన వైద్యులు విఫలమయ్యారు. చివరికి శిశువు చనిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: