మనిషి జీవితం అనేది గ్యారెంటీ లేనిది అన్నది నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అని చెప్పాలి. సాధారణంగా ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఏదైనా అనారోగ్య సమస్య వస్తే లేదా రోడ్డు ప్రమాదం బారిన పడితేనో లేకపోతే వృద్ధాప్యంలోనొ ఇక ప్రాణాలు పోవడం లాంటివి జరుగుతుంది అని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవలే కాలంలో సంతోషంగా ఉన్నవారు ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకున్న వారు సైతం క్షణాల వ్యవధిలో చూస్తూ చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతూ ఉన్న ఘటనలు ప్రతి ఒక్కరిలో ప్రాణ తీపిని పెంచుతూ ఉన్నాయి.


 ఇక ఇలాంటి ఘటనలు కోకోళ్లలుగా  వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ఎందుకు జరుగుతుందో.. ఇలా జరగకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలో కూడా ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉండి నవ్వుతూ గడిపిన వారు క్షణాల వ్యవధిలోనే ప్రాణాలను వదులుతూ ఉన్నారు. మున్నటికి మొన్న పెళ్లి జరుగుతున్న సమయంలో వధువు కుప్పకూలిపోయి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. వధువు మృతి చెందడంతో చివరికి ఇక ఆమె చెల్లిని ఇచ్చి పెళ్లి తంతు జరిపించారు. ఇక్కడ ఇలాగే పెళ్లి సందడి ఉన్న సమయంలో ఊహించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.


 పెళ్లి మండపంలో డీజే మ్యూజిక్ పెళ్లి కుమారుడి ప్రాణాలను తీసేసింది అని చెప్పాలి. బీహార్ మనితార్ గ్రామానికి చెందిన సురేంద్ర కుమార్ అనే వ్యక్తికి అదే ప్రాంత యువతితో ఇందర్వాలో పెళ్లి జరుగుతుంది. అయితే వివాహానికి వచ్చిన యువకులు డిజె సౌండ్ విపరీతంగా పెట్టి డాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ప్రతి పెళ్లిలో ఇది సర్వసాధారణం. అయితే ఇలా డీజే సౌండ్ ఎక్కువ పెట్టడంతో వేదికపై ఉన్న పెళ్ళికొడుకు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. డీజే సౌండ్ వల్లే ఇలా హార్ట్ ఎటాక్ వచ్చిందని వైద్యులు తెలపడంతో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: