
పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో ఉంటున్న భార్యాభర్తలు ఇలా ఏదో ఒక విషయంలో తరచూ గొడవ పడుతూనే ఉంటారని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారు. కానీ ఇలా గొడవపడే భార్యాభర్తలు మాత్రమే కాదు ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమ ఆప్యాయతలు చూపించే భార్యాభర్తలు కూడా ఉన్నారు అన్న విషయం మాత్రం నేటి రోజుల్లో కొంతమందిని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఇక ఇక్కడ ఒక భర్త చేసిన పని చూస్తే భార్యపై భర్తకు ఇంత ప్రేమ కూడా ఉంటుందా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి.
ఎందుకంటే భార్యకు కలిగిన చిన్న ఇబ్బందిని తట్టుకోలేకపోయిన భర్త ఏకంగా ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఇంతకీ ఇబ్బంది ఏంటో తెలుసా దోమలు కుట్టడమే. యూపీకి చెందిన అసద్ ఖాన్ భార్య ఇటీవల చందౌసిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే భార్య కూతురుని విపరీతంగా దోమలు కూడుతున్నాయని.. అర్ధరాత్రి దుకాణాలన్నీ మూసేసి ఉన్నందున మస్కిటో కిల్లర్ కావాలని కోరుతూ పోలీసులకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే మానవీయ కోణంలో స్పందించిన పోలీసులు ఆసుపత్రికి వచ్చి మరి మస్కిటో కిల్లర్ అందించారు. పోలీసులు మానవత్వంతో చేసిన సహాయానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఘటన కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలఇక ఈ ఘటన కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.