నేటి ఆధునిక సమాజం లో కూడా ఎక్కడికక్కడ కులం మతం అన్నది ఇంకా పేరుకు పోయింది అన్నది వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూస్తే అర్థమవుతుంది . ఎందుకంటే ఇప్పటికీ కూడా తల్లి దండ్రులు అటు పిల్లలకు ప్రేమించే స్వేచ్ఛను ఇవ్వడం లేదు అని చెప్పాలి. అంతే కాదు తమకంటే తక్కువ కులం వారిని ప్రేమించాను అన్న కారణం తో సొంత బిడ్డలనే దారుణం గా హత్యలు చేస్తున్న ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. దీంతో ప్రేమ అనేది నేటి రోజుల్లో ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే వెలుగులోకి వస్తున్న పరువు హత్యలు యువతి యువకులు అందరిలో కూడా ప్రాణభయాన్ని కలిగిస్తున్నాయ్. ప్రేమిస్తే ఇలా దారుణంగా హత్యకు గురవాల్సి వస్తుందా అని ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది అని చెప్పాలి. అయితే మరికొన్ని ఘటనల్లో కొంతమంది ప్రేమ కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం కూడా జరుగుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఏకంగా కూతురు చేసిన పనికి తల్లి ప్రాణం పోయింది.


 ఎంతో అల్లారి ముద్దుగా కూతురుని పెంచి పెద్ద చేసింది ఆ తల్లి. ఇక ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టి పెళ్లి చేయాలని అనుకుంది. కానీ అంతలోనే కూతురు ట్విస్ట్ ఇచ్చింది. తల్లికి చెప్పకుండానే లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది తల్లి. మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాసరావు, నిర్మల దంపతులకు కుమారుడు కూతురు ఉండగా.. కూతురు తోటి విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి బాధతో కృంగిపోయిన నిర్మల చివరికి ఇంట్లో బెడ్ రూమ్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లిలో వెలుగు చూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: