సాధారణంగా ప్రతి ఒక్కరికి కుందేలు- తాబేలు కథ గుర్తుండే ఉంటుంది. కుందేలు, తాబేలు ఒక రన్నింగ్ రేస్ లో పాల్గొంటే.. చివరికి తాబేలు విజయం సాధిస్తుంది అని ఇక చిన్నప్పుడు ఎంతోమంది పాఠ్యపుస్తకాల్లో చదివి కూడా ఉంటారు. తాబేలు గెలిచే ఛాన్స్ లేదు అని గుడ్డిగా నమ్మిన కుందేలు ఇక కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఇక కాసేపు హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. అయితే పట్టు విడవకుండా రేస్ లో గెలిచేందుకు పోరాడిన తాబేలు మాత్రం మెల్లిగానే ముందుకు కదిలినప్పటికీ చివరికి ఇక రేస్ లో విజయం సాధిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే తాబేలు, కుందేలు కథ విన్నప్పుడు ఇలాంటివి కేవలం పాఠ్య పుస్తకాల్లో మాత్రమే చదువుకోడానికి బాగుంటాయి. నిజజీవితంలో ఇలాంటి ఘటనలు అస్సలు జరగవు అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఎందుకంటే ఒకసారి రేస్ లో పాల్గొన్న తర్వాత ఎవరు ఇలా ప్రత్యర్ధులను తక్కువగా అంచనా వేసి రెస్ట్ తీసుకోవాలని అనుకోరు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తాబేలు, కుందేలు కథ నిజం అయింది అని చెప్పాలి. ఒక వ్యక్తి అందరికంటే ముందు పరిగెత్తి ఇక కాసేపు రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాడు. చివరికి ఇక వెనకాల ఉన్నవాళ్లు అతన్ని దాటుకుని వెళ్లి రేస్ గెలిస్తే అతను మాత్రం ఓడిపోయాడు. ఇక ఇలా తాబేలు, కుందేలు స్టోరీ తరహా ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కండవా ప్రాంతంలో ఇటీవల ఒక రేస్ నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ నియామకాల్లో భాగంగా ఇటీవల రేస్ నిర్వహించగా.. పహాడ్ సింగ్ అనే యువకుడు అందరికంటే ముందంజలో వేగంగా పరిగెత్తాడు. కానీ అంతలోనే అతని మదిలో ఒక ఆలోచన మెదిలింది. తనతో పోటీ పడుతున్నవారు తనకంటే వెనకాల చాలా దూరంలో ఉండడంతో ఇక కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాడు. ఇక పక్కన అలాగే కూర్చొని నిద్రలోకి జారుకున్నాడు. ఇంకేముంది వెనకాల ఉన్నవాళ్లు ముందుకు దూసుకు వెళ్లి రేసులో విజయం సాధిస్తే.. అతనికి మెలుకువ వచ్చేసరికి రేస్ కూడా పూర్తయిపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: