
ఈ క్రమంలోనే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వస్తున్నప్పుడు పిడుగులు పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇలాంటి సమయంలో ఎంతోమంది జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఎందుకంటే పిడుగు పడింది అంటే గాయపరచడం... అనారోగ్యానికి గురి చేయడం కాదు.. సెకండ్ల వ్యవధిలోని ప్రాణం తీసేస్తూ ఉంటుంది పిడుగుపాటుతో వేల వాట్ల విద్యుత్ ఒంట్లోకి చేరి మనిషిని బూడిద చేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో పిడుగుపాటు ఎంతో దారుణంగా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి తెగచక్కర్లు కొడుతుంది.
ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. మహారాష్ట్రలో ఈ ఘటన వెలుగు చూసింది. నడుచుకుంటూ తన దారిన తాను వెళుతున్న ఒక కార్మికుడి పై పిడుగు పడి ఒక్కసారిగా ప్రాణాలు తీసేసింది. ఈ మాటలకందని విషాదానికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. చంద్రపూర్ జిల్లా భద్రావతి తాలూకా మజిలీ బోకు గనిలో పనిచేస్తున్న కార్మికుడు పని ప్రదేశం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అంతలో ఆకాశం నుంచి ప్రకాశవంతమైన మెరుపు అతనిపై పడింది పిడుగు దాటికి బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు.