
కానీ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు సైతం వీధి రౌడీల్లాగానే ప్రవర్తిస్తూ ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం చేస్తుంటారని ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఘటనల ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మొన్నటి వరకు ఏకంగా ప్రయాణికులు విమానంలో కొట్టుకున్న వీడియోలు వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఏకంగా విమానాశ్రయంలో రెండు గ్రూపులు దారుణంగా కొట్టుకున్న వీడియో ఒకటి ట్విట్టర్ వేదిక వైరల్ గా మారగా ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడో కాదు సెక్యూరిటీ అధికంగా ఉండే అమెరికాలొ.
చికాగోలోని హెయిర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన జరిగింది. విమానం దిగివస్తుండగా ప్రయాణికుల మధ్య మాట పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. ఈ క్రమంలోనే ఒక మహిళపై ఇద్దరు వ్యక్తులు దాడి చేయడంతో గొడవ మొదలైంది. ఇక ఈ గొడవలో రెండు గ్రూపులు దారుణంగా కొట్టుకున్నాయి అని చెప్పాలి. మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని దారుణంగా కొట్టుకుంటే ఇక కొంతమంది వ్యక్తులు దారుణంగా తన్నుకున్నారు. ఇక పక్కనే ఉన్న ఒక వ్యక్తి వీరిని ఆపడం మానేసి.. ఇదంతా వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక వీరిని బాక్సింగ్ పోటీలకు పంపిస్తే గోల్డ్ మెడల్ వస్తుందని కొంతమంది నేటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.