టెక్నాలజీతో కూడిన ఆధునిక సమాజంలోకి అడుగుపెడుతున్న మనిషి ఇక విచక్షణ జ్ఞానాన్ని మాత్రం కోల్పోతున్నాడా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు  చూసిన తర్వాత ప్రతి ఒక్కరి నోటి నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పెద్దపెద్ద సమస్యలు వచ్చినా ఎంతో తెలివితో ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్న మనిషి.. ఇక ఇప్పుడు చిన్నచిన్న కారణాలకే చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న మనిషి కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాడు..


 ముఖ్యంగా ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. టీచర్ తిట్టిందని.. తల్లిదండ్రులు మందలించారని లేదా పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని.. అభం శుభం తెలియని చిన్నారులు సైతం కఠిన నిర్ణయాలు తీసుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక ఇంకొన్ని ఘటనల్లో భార్యాభర్తల మధ్య జరిగే చిన్నపాటి గొడవలతోనే ఇక విరక్తి చెంది ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాక.. ఇంత చిన్న కారణాలకు కూడా ప్రాణాలను తీసుకుంటారా అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. భార్య తనకు చికెన్ వండి పెట్టలేదు అనే మనస్థాపనతో భర్త చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రేమ్ నగర్ లో వెలుగులోకి వచ్చింది. ఫుల్లుగా మద్యం తాగి వచ్చాడు భర్త పవన్. అయితే భార్యను చికెన్ వండి పెట్టమని చెప్పాడు. కానీ అప్పటికే భర్త మధ్యం తాగొచ్చాడు అన్న కోపంలో ఉన్న భార్య చికెన్ వండడానికి నిరాకరించింది. దీంతో ఇదే విషయంపై ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపన చెందిన పవన్ క్షణికావేషంలో చివరికి రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయాడు. కాగా పవన్ దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: