నేటి సభ్య సమాజంలో ఆడపిల్లలుగా పుట్టడమే మేము చేసిన పాపమా అని ఎంతోమంది బాధపడే విధంగా నేటి రోజుల్లో ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్ల కనిపిస్తే చాలు మగాడిలో ఉన్న మృగం బయటికి వచ్చి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఆడపిల్ల మనిషి కాదు కేవలం ఒక ఆట బొమ్మ మాత్రమే అనుకుంటున్న కొంతమంది నీచులు ఏకంగా ఆడపిల్లపై దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఆడపిల్ల ఇంటి గడప దాటి కాలు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే మరికొన్ని ఘటనల్లో అయితే ఏకంగా ఇంట్లో వారు కూడా మహిళలపై అత్యాచారం చేస్తూ ఉండడం చూస్తూ ఉంటే.. ఇక ఆడపిల్ల జీవితం ఎంతో దుర్భరంగా మారిపోయింది అన్నది ఈ ఘటనల ద్వారా అర్థమవుతుంది అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత దారుణమైనది. అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలిక ఏకంగా బిడ్డకు జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన పంజాబ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పగ్వారాలో ఈ దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలిక శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఏడు నెలల క్రితమే ఆ బాలిక గర్భం దాల్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం మాత్రం బాలికకు తెలియదు. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగా పరీక్షించిన వైద్యులు సదరు బాలిక గర్భవతి అని నిర్ధారించారు. అనంతరం ఇక ఆ బాలికకు ప్రసవం చేసి ఏకంగా 800 గ్రాములు ఉన్న బిడ్డను బయటకు తీశారు. అయితే ప్రస్తుతం తల్లి బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే గతంలో తనపై అత్యాచారం జరిగిందని సదరు బాలిక చెప్పడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: