ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి . ఎందుకంటే ఊహించని ఘటనలు కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు తీస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చుసిన తర్వాత విధి ఆడిన వింత నాటకంలో నిజంగానే మనిషి జీవితం కీలుబొమ్మలాంటిది అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతోంది అని చెప్పాలి. మొన్నటి వరకు కరోనా వైరస్ ఎక్కడ ప్రాణాలు తీస్తుందో అనే అందరూ భయంతో చచ్చిపోయారు.


 రేపు అనేది ఉంటుందో లేదో అనే భయంతోనే ప్రతిరోజు కూడా దినదిన గండం అన్నట్లుగానే బ్రతికారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. ఊహించని రీతిలో మనిషి ప్రాణాలను తీసేయడానికి ఎన్నో రకాల ఘటనలు జరుగుతున్నాయి. సడెన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇవన్నీ సరిపోవు అన్నట్లు ఎంతోమంది రోజువారి జీవితంలో వాడే వస్తువుల కారణంగా కూడా ఊహించని రీతిలో ప్రాణాలు పోతున్నాయి అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఏకంగా.. ఒక మహిళ కూలర్ కారణంగా కరెంట్ షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ఘటన గురించి మరవక ముందే ఇలాంటి తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా చల్లటి గాలి ఇచ్చి ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అని భావించి కొనుగోలు చేసిన ఏసీ చివరికి ప్రాణం తీసేసింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దామర్ల శ్రీదేవి అనే 52 ఏళ్ల మహిళ ఆమె కుమారుడు సాయి తేజ ఈనెల 28వ తేదీన ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోయారు. మధ్య రాత్రి విద్యుత్ హై వోల్టేజీతో ఏసీ పేలుంది. దీంతో అందులో నుంచి విడుదలైన గ్యాస్ పీల్చి ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో నుంచి పొగలు రావడంతో గమనించిన స్థానికులు డోర్లు బద్దలు కొట్టి ఇక అపస్మారక స్థితిలో ఉన్న ఆ ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించగా చివరికి చికిత్స పొందుతూ మరణించింది తల్లి శ్రీదేవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ac