
ఏకంగా ఆ సెలూన్ షాప్ వద్ద ఒక కామాంధుడు కాచుకొని ఉన్నాడు అని మాత్రం ఊహించలేకపోయింది ఆ బాలిక. ఈ దారుణమైన ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్‌లో ఆదర్శ్ నగర్ లో ఓ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. అయితే ఇటీవల రోజు లాగానే పాఠశాలకు వెళ్లిన బాలిక ఇక స్కూల్ ముగిసిన వెంటనే ఇంటికి తిరుగు ప్రయాణమైంది. అయితే రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. దీంతో దగ్గరలో ఉన్న ఒక సెలూన్ షాప్ బయట వెళ్లి నిలబడింది.
అయితే తడిసిన బట్టలతో బాలిక ఇలా సెలూన్ షాప్ ముందు నిలబడటం షాప్ ఓనర్ 23 ఏళ్ల ప్రవీణ్ అనే వ్యక్తి చూసాడు. వర్షం ఎక్కువగా పడుతుంది బయట ఏం నిలబడతావు.. లోపలికి రా అంటూ బాలికను లోపలికి పిలిచాడు. మంచోడు అయ్యుంటాడు అనుకోని నమ్మిన బాలిక లోపలికి వెళ్ళింది. బాలిక లోపలికి వెళ్ళగానే అసలు స్వరూపం బయటపెట్టిన ప్రవీణ్.. తన దగ్గర ఉన్న కత్తి చూపించి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే ఆ తర్వాత బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. తల్లిదండ్రులతో జరిగిన విషయం చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.