మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుంది అన్నది ఊహకందని  విధం గానే మారి పోయింది. ఎందుకంటే మనిషి ప్రాణాలను తీసేందుకు ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు ముంచు కొస్తున్నాయి. ఊహించని రీతిలో ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. ఇక ఇవేవీ చాలవు అన్నట్లు డెంగ్యూ మలేరియా అంటూ ప్రాణాంతకమైన వ్యాధులు కూడా మనిషి ప్రాణాలను ఎప్పుడు తీసేస్తాయో కూడా అర్థం కాని విధంగా మారి పోయింది పరిస్థితి. ఇక ఇటీవల కాలంలో అయితే సడన్ హార్ట్ ఎటాక్ల కారణం గా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది అని చెప్పాలి.


 ఆరోగ్యం గా ఉన్నవారు ఆరోగ్యం గా లేనివారు అనే తేడా లేదు. సంతోషం గా నవ్వుతూ ఉన్న వారు సైతం కేవలం క్షణాల వ్యవధిలోనే చూస్తుండ గానే కుప్ప కూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరి లో కూడా ప్రాణ తీపిని పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. అంతేకాదు సడెన్ హార్ట్ ఎటాక్ల కారణం గా ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలియని విధంగా మారి పోయింది పరిస్థితి. దీంతో ఇక ప్రతి ఒక్కరు కూడా క్షణక్షణం భయపడుతూనే బ్రతుకును వెల్లదీస్తున్నారు. ఇటీవల జగిత్యాలలో కూడా ఇలాంటి విషాదకర ఘటన జరిగింది.


 షటిల్ ఆడుతూ ఒక వ్యక్తి కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. వెంకట గంగారాం అనే 53 ఏళ్ల వ్యక్తి ఎంతో ఉత్సాహంగా షటిల్ ఆడుతూ ఉన్నాడు. కానీ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. అయితే అక్కడే ఉన్న స్నేహితులు అప్రమత్తమై అతనికి సిపిఆర్ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే ఆసుపత్రికీ తరలించగా.. చివరికి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి కారణం సడన్ హార్ట్ ఎటాక్ అన్న విషయాన్ని తేల్చారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: