ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనల గురించి తెలిసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషుల లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అన్న విషయం కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే సాటి మనుషుల విషయంలో జాలి దయతో వ్యవహరించాల్సిన మనుషులు.. క్రూర మృగాలుగా మారిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆడపిల్ల కనిపించిందంటే చాలు మగాళ్లలో ఉన్న మృగాలు బయటికి వచ్చి దారుణంగా అత్యాచారాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి.



 వెరసి ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకు ఆడపిల్లల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలి అంటేనే ఆడపిల్ల భయపడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ఇక మానవ మృగాల తీరులో మాత్రం ఎక్కడ మార్పు రావడం లేదు అని చెప్పాలి. ఒంటరిగా కనిపిస్తేనే కాదు ఏకంగా పక్కన కుటుంబ సభ్యులు ఉన్న వారిపై దాడి చేసి మరి అత్యాచారం చేస్తున్న భయంకరమైన ఘటనలు వెలుగు చూస్తున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో కోకోళ్లలుగా మారిపోయాయి అని చెప్పాలి. సికింద్రాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది.



 మానసిక దివ్యాంగురాలు అయిన ఏడేళ్ల బాలికపై అయ్యో పాపం అంటూ జాలి చూపించాల్సింది పోయి.. అతను మాత్రం కామంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానిక ఎల్ ఎన్ నగర్ లో తల్లి షాప్ కు వెళ్లి వచ్చేసరికి రక్తస్రావం  అవుతున్న బాలికను చూసి వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించింది. అయితే బాలికపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే వెంటనే తల్లి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అత్యాచారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఎవరు అని కనుక్కునే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: