చిన్నచిన్న కారణానికి కష్టంలో తోడుగా నిలవాల్సిన భర్త చివరికి క్రూరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు రోజురోజుకి ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. భార్య 5000 దొంగలించింది అనే అనుమానంతో కట్టుకున్న భార్యని దారుణంగా తినే అన్నం లో విషం పెట్టి చంపాడు భర్త. ఈ ఘటన ఏపీలోని నందిగామలో వెలుగులోకి వచ్చింది. పెనుగంచిప్రోలు మండలానికి చెందిన 28 ఏళ్ల జ్యోతి కి 12 ఏళ్ల క్రితం హనుమంతరావు తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే ఈ నెల ఆరవ తేదీన ఇంట్లో 5000 రూపాయలు నగదు మాయమైంది. భర్త హనుమంతరావు నగదు కనిపించడం లేదని నువ్వు చూసావా అంటూ భార్యను అడిగితే డబ్బులు విషయం తనకు తెలియదని భార్య చెప్పింది. అయితే హనుమంతరావు మాత్రం భార్య మీద అనుమానపడ్డాడు. ఇక తల్లి చిట్టెమ్మ, తమ్ముడు కోటేశ్వరరావు లతో కలిసి ఆమెను తీవ్రంగా కొట్టాడు. అదే రోజు రాత్రి ఆమె భోజనం లో విషం కలిపాడు. అయితే భోజనం చేసిన అంతరం కడుపులో మంటగా ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళింది. ఆ తర్వాత పుట్టింటికి వెళ్లి రెండు వారాలు వైద్యం చేయించుకుంది. కడుపునొప్పి తగ్గకపోవడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. ఫుడ్ పాయిజన్ అయింది అన్న విషయం బయటపడింది. చివరికి ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి