ఇటీవల కాలంలో జనాల తీరు చూస్తే మరి భయంకరంగా మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎలా బురిడీ కొట్టించాలి. ఎలా మోసం చేసి అందిన కాడికి దోచుకోవాలి అని ఆలోచిస్తున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు  కానీ అటు సాటి మనిషికి సహాయం చేయాలి అనే గుణం ఉన్నవారు ఎక్కడ కనిపించడం లేదు. ఇక ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా చివరికి అందిన కాడికి దోచుకుపోతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా రెప్పపాటు కాలంలో సెల్ఫోన్ చోరీలు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.



 కాన్పూర్ పట్టణంలో ఎప్పుడు కస్టమర్లతో బిజీబిజీగా ఉండే స్వీట్ షాప్ లో స్వీట్లు కొనేందుకు వెళ్ళాడు ఒక వ్యక్తి. అదే సమయంలో మరో వ్యక్తి అతని వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఇక మరో కస్టమర్ అయి ఉంటాడులే.. ఏదో స్వీట్ కొనడానికి అక్కడికి వచ్చి నిలబడ్డాడు అని వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. కానీ పక్కనే నిలబడి రెపపాటు కాలంలో ఎంతో తెలివిగా అతనికి కాస్తైన అనుమానం రాకుండా ఫోన్ కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏకంగా బిల్లు కట్టేందుకు సదరు వ్యక్తి డబ్బులు తీస్తున్న సమయంలో ఫోన్ కొట్టేసాడు అని చెప్పాలి.


 అయితే ఏకంగా సదరు కస్టమర్ జోబులో నుంచి ఫోన్ మాయమైన విషయం కూడా అతనికి అర్థం కాలేదు అంటే ఇక దొంగ ఎంత తెలివిగా.. ఎంత చాకచక్యంగా మొబైల్ కొట్టేశాడో అర్థం చేసుకోవచ్చు. అయితే కాసేపటికి తన ఫోన్ కనిపించడం లేదని గుర్తించిన సదరు వ్యక్తి.. ఇక ఆ షాప్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది  ఎందుకంటే కస్టమర్ మొబైల్ నీ వ్యక్తి దొంగతనం చేస్తున్న విషయం సీసీటీవీలో రికార్డయింది అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: