విమాన ప్రయాణం అంటే చాలు ఎంతో కంఫర్టబుల్ గా ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఎంతో వేగంగా విమానంలో గమ్యస్తానానికి చేరే అవకాశం ఉంటుందని భావిస్తూ ఉంటారు. కానీ ఇక విమానంలో ప్రయాణించే వారికి సైతం కొన్ని కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురవుతాయి అన్నదానికి నిదర్శనంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటనలు మారాయి అని చెప్పాలి. ఏకంగా విమానంలో హాయిగా ప్రయాణించడం ఏమో కానీ ప్రాణాలు అటు నుంచి అటే గాల్లో కలిసిపోతాయేమో అని వెన్నులో వణుకు పుట్టించే ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.


 ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి. ఒక ప్రయాణికుడు చేసిన పనికి మిగతా ప్రయాణికులు అందరూ కూడా విమానంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కునట్టు గడపాల్సి వచ్చింది. ఇంతకీ సదరు ప్రయాణికుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా గాలిలోనే విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అగర్తల లోనే మహారాజా బీర్ విక్రమ్ విమానాశ్రయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విమానం దిగడానికి 10 నిమిషాల ముందు ఈ ఘటన జరిగింది. కోల్కతా డమ్ డమ్ విమానాశ్రయంలో దేబ్ నాద్ అనే వ్యక్తి గువాటి మీదుగా అగర్తల వెళ్లేందుకు ఇండిగో విమానంలో ఎక్కాడు. అయితే అగర్తలలో విమానం మరికాసేపట్లో ల్యాండ్ అవుతుంది అనగా సదర వ్యక్తి తన సీట్ నుంచి పరుగున వెళ్లి విమానం తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక ఎయిర్ హోస్టెస్ దేబ్ నాథ్ ప్రయత్నాన్ని పసిగట్టి అతడిని అడ్డుకుంది. ప్రయాణికుల సాయంతో అతనిని వెనక్కి లాగేసింది  అయితే అయినప్పటికీ అతను ఆగకుండా తోటి ప్రయాణికులు పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మళ్ళీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన ఇతర ప్రయాణికులు అతనికి దేహశుద్ధి చేశారు  ఇక విమానం ల్యాండ్ అయిన తర్వాత అతనిని పోలీసులకు అప్పగించారు తోటి ప్రయానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి: