ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి వచ్చిన నేపద్యంలో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధి లో అరచేతి లో ఉన్న స్మార్ట్ ఫోన్లో అన్ని వాలిపోతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో అన్ని విషయాలను కూడా అతి తక్కువ సమయంలోనే తెలుసుకోగలుగుతున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియా లోకి వచ్చే కొన్ని వీడియోలు అప్పుడప్పుడు తెగ వైరల్ గా మారిపోతుంటాయి అని చెప్పాలి. ఇప్పుడు వైరల్ గా మారి పోయిన వీడియో కూడా ఇలాంటి కొవలోకి చెందినదే.


 మొబైల్ అనేది నేటి మనిషి జీవితంలో అత్యవసరంగా మారిపోయింది  ఆహారం లేకపోయినా మనిషి బ్రతుకుతాడేమో కానీ.. మొబైల్ లేకపోతే కనీసం ఒక్క నిమిషం కూడా ఉండలేడేమో అనేంత పరిస్థితి వచ్చింది. ఇలా మొబైల్ మనుషులందరినీ కూడా బానిసలుగా మార్చేసుకుంది  ఇక చాలామంది మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. కొంతమంది ఇలా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటారు. ఇక మరికొంతమంది ఫోన్లో మునిగిపోయి చుట్టూ ఏం జరుగుతుందో కూడా అసలు గమనించరు.


 అయితే ఇలా మొబైల్ లో మునిగిపోయి ప్రపంచాన్ని మరిచిపోవడమే ఇక్కడ ఒక వ్యక్తికి  ఊహించని షాక్ ఇచ్చింది. ఒంటరిగా వెళ్తున్న యువతిని  వెంబడిస్తూ వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చి చివరికి ఆమె ఫోన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. దీనిని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు  ఫోన్ మత్తులో పడి పట్టించుకోకుండా ఉంటే ఏమవుతుందో గమనించాలని ప్రజలను హెచ్చరించాడు. ఇందులో ఒక యువతి నోయిడా సెక్టర్ 34లో ఫోన్ మాట్లాడుతూ రోడ్లు నడుచుకుంటూ ఉండగా.. వెనుక నుంచి వచ్చిన వ్యక్తి ఆమె చేతుల్లో మొబైల్ లాక్కుని పారిపోయాడు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: