ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక ఏ విషయం అయినా ఇట్టే అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో తెలుసుకోగలుగుతున్నారు జనాలు. కూర్చున్న చోటు నుంచి మనిషి ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 మరీ ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు ఏకంగా చిన్న చిన్న విషయాలకి వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయడం చేస్తూ ఉంటారు. అదేంటి ఇంత చిన్న విషయానికి ఎందుకు ఫిర్యాదు చేశారు అని ఈ విషయం తెలిసిన అందరికీ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా ఫిర్యాదు చేయడం ద్వారా సదరు వ్యక్తికి లాభం చేకూరుంది అన్న విషయం తెలిసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఈ విషయం తెలియక ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండిపోయాం అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. అయితే ఇలాంటి అనుభవాన్ని మీరు కూడా ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారు.


 అతను నచ్చిన ఆహారం తినడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్ళాడు. కానీ అక్కడ సిబ్బంది మాత్రం ఉచితంగా అతనికి నీరు అందించలేదు. తమ దగ్గర వాటర్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. దీంతో సదరు కస్టమర్ ఏకంగా హైదరాబాద్లోని జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సదరు రెస్టారెంట్ కు 5000 పైన్ వేసింది. జిఎస్టి, సర్వీస్ చార్జీలతో పాటు సదరు కస్టమర్ కి 5000 పరిహారం చెల్లించాలి అంటూ ఆదేశించింది వినియోగదారుల కోర్టు. ఎందుకంటే జిహెచ్ఎంసి పరిధిలోని ఏ రెస్టారెంట్ లో అయినా సరే ఉచితంగా శుద్ధి చేసిన నీటిని అందించాలని ఒక రూల్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: