గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. అయితే మోడీ రాకతో మొదట ప్రభుత్వ రంగ బ్యాంకులు మోడీ వల్ల సంక్షోభానికి గురవుతున్నాయి అన్నట్లు మాట్లాడారు. కానీ ఆ తర్వాత నోట్ల రద్దు మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులనేవి పుంజుకోవడం మొదలుపెట్టాయి. 2016 లోనూ, ఇలాగే తాజాగా ఇప్పుడు  2000 నోట్ల రద్దు టైంలో కూడా పుంజుకుంటున్నట్లుగా తెలుస్తుంది.


దీనిపై చానా శాస్త్రి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రాని బాకీలు ఎక్కువైపోయాయి. పెద్దలకు భారీ ఎత్తున రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రధాని నరేంద్ర మోడీ దివాలా కొట్టిస్తున్నారని అప్పట్లో అన్నారు. చిదంబరం లాంటి మాజీ మంత్రులు ఇంకా రఘురాం రాజు అనే కాంగ్రెస్ ఆర్థికవేత్తలు మీడియాలో ఈ విషయంపై మోడీ మీద గోల గోల చేశారు.


అయితే పరిస్థితి వీళ్ళ వ్యాఖ్యల కన్నా విరుద్ధంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. 2014లో మన్మోహన్ సింగ్ హయంలో మదింపు లేకుండా విచ్చలవిడిగా ఇచ్చిన రుణాలు తర్వాత ఎన్.పీ.ఎల్ గా మారాయట. అయినా సరే బ్యాంకులు ఆరోగ్యంగా ఉన్నాయంటూ వాటిని ఎన్పిఎల్ గా చూపించి వాటి వసూళ్లకు చర్యలు తీసుకోకుండా ఉండడంవల్ల మోడీ వచ్చిన కొత్తలో ప్రభుత్వ రంగ బ్యాంకులు దివాలా అంచుకి చేరుకున్నాయి.


ఎంతెలా చేరాయంటే 2017 వచ్చేసరికి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర నష్టాల మొత్తం 85390కోట్లకి చేరుకున్నాయి. అయితే మోడీ తీసుకొచ్చిన కొన్ని సంస్కరణల వల్ల బ్యాంకింగ్ పుంజుకుందని తెలుస్తుంది. చిన్న ప్రభుత్వ బ్యాంకులను పెద్ద ప్రభుత్వ బ్యాంకులతో కలపడం ఒక ఎత్తు. రుణాల రికవరీ కోసం ఐపీసీ లాంటి కఠిన చట్టాలను తీసుకురావడం మరొక ఎత్తు. బ్యాంకు మేనేజర్ల నియామకంలో రాజకీయ ప్రమేయం తగ్గించి మరొక కమిటీ ద్వారా అపాయింట్ చేయడం చేశారు. ఇలా ఆయన చేసిన సంస్కరణల వల్ల బ్యాంకింగ్ రంగం పుంజుకుంది. మరి ఈ  కథనంలో ఎంత వాస్తవం ఉందో?

మరింత సమాచారం తెలుసుకోండి: