దీంతో గెలుపోటముల నిర్ణయించడంలో ముస్లింలు క్రియాశీలకంగా మారారు. ఆ సామాజిక వర్గం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ లు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంఐఎం పార్టీ కి హైదరాబాద్ లోని ముస్లిం ప్రాంతాల్లో తిరుగులేదు. ఇప్పటి వరకు ఈ పార్టీ ఎదుటి వారిని భయపెట్టింది. ఇప్పుడు కాంగ్రెస పార్టీ దెబ్బకి ఎంఐఎం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన పుణ్యమా అని ముస్లిం ఓటర్లను ఒకే దగ్గర చేర్చారు. దీంతో ఏడు నియోజకవర్గాలు పూర్తిగా ఎంఐఎం చేతిలోకి వచ్చేశాయి. ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఓ ఎంపీస్థానానికి ఆ పార్టీకి అక్కడ తిరుగులేదు. దాదాపు ఒక్కో నియోజకవర్గంలో 50శాతానికి పైగా ముస్లింలు ఆ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నారు. దీంతో ఆ స్థానాల్లో ఎంఐఎంకు తిరుగులేదు. ఆ భరోసాతో బిహార్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర లో పోటీ చేశారు. అక్కడి స్థానిక నేతలతో పాటు జాతీయ నాయకులకు సైతం సవాల్ విసిరారు.
ఇలాంటి పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ భయం పట్టుకుంది. ఈ దఫా ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ కూడా చేసేందుకు యత్నిస్తోంది. ఎంఐఎం లేదంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. కొన్ని ముస్లిం సంఘాలు మాత్రం కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయించారు కూడా. దీంతో ఈ సారి ముస్లిం ఓట్లు తమకు పడతాయా అని అసదుద్దీన్ భయపడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే తన భవిష్యత్తు ఏంటనే డైలామాలో పడినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి