2014లో చంద్రబాబు భారతీయ జనతా పార్టీ నాయకులతో కర్ణాటకలో కూర్చుని మాట్లాడి మరీ పొత్తు కలుపుకోవడం జరిగింది. అప్పటికి ఒక పక్క పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని విభేదిస్తూ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ వైపుకి మొగ్గు చూపుతూ ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ని కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ఒప్పించి మరీ తెలుగుదేశం పార్టీ వైపుకు మళ్ళేలా చేయించుకోగలిగారు చంద్రబాబు నాయుడు.


అయితే 2014 తర్వాత పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టడం జరిగింది. 2018లో అయితే తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ నితీవ్రంగా విమర్శించడం కూడా జరిగింది. తిరిగి 2019లో అదే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ తో కలిసి సాగాలని డిసైడ్ అయ్యింది. తాజాగా అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో కీలక అవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఒక అడుగు వెనక్కి వెయ్యడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


పవన్ కళ్యాణ్  అత్తారింటికి దారేది సినిమాలో  "ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు" అనే పాపులర్ డైలాగ్ ఇక్కడ చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తర్వాత నారా లోకేష్ భారతీయ జనతా పార్టీతో కలవడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. అవి ఫలించి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది.


ఈ విధంగా భారతీయ జనతా పార్టీ తో కలిసి సాగాలని అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఆశలకు అనుకూల ప్రతిఫలం దక్కుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ కలిసే అవకాశం ఉందని ఢిల్లి వర్గాల నుండి వినపడుతున్నటువంటి గట్టి మాట. ఈ విధంగా అటు జనసేనతోనూ ఇటు భారతీయ జనతా పార్టీతోనూ కలిసి పొత్తు పెట్టుకోవడం కోసం బాబు ఎన్ని అడుగులైనా వెనక్కి వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: