తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీలోఆరు బైపాస్లకు 930 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేసింది. బెంగళూరు చెన్నై రహదారిని అనుసంధానిస్తూ చిత్తూరు జిల్లా దగ్గర నాలుగు లైన్ల బైపాస్ రహదారిని 10 కిలోమీటర్లు నిర్మిస్తారు.. ఈ రహదారి నిర్మాణం విలువ 120 కోట్లు. కర్నూలు జిల్లా బైరెడ్డిపల్లి దగ్గర నాలుగు లైన్ల బైపాస్ 6 కిలోమీటర్ల వరకు కడతారు దీనికి 70 కోట్లు ఖర్చు అవుతుంది . తాడిపత్రిలో రెండు లైన్ల బైపాస్ రహదారి నిర్మిస్తారు ఇది 10 కిలోమీటర్ల వరకు ఉండబోతుంటే దీన్ని 95 కోట్లతో నిర్మిస్తారు.



ఆదోనిలో రెండు లైన్ల బైపాస్ రహదారి నిర్మిస్తారు. 7 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణానికి 80 కోట్ల దాకా కేటాయించారు . నరసాపురం వద్ద చెన్నై కోల్కత్తా జాతీయ రహదారి అనుసంధానిస్తూ రెండు లైన్ల బైపాస్ రహదారిని నిర్మిస్తారు. 23.2 కి.మీ ఈ రహదారికి 480 కోట్లు కేటాయించారు. ల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు దగ్గర బైపాస్ రహదారిని నిర్మిస్తున్నారు ఎనిమిది కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణానికి 75 కోట్ల వరకు కేటాయిస్తున్నారు.


ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల  విషయంలో తన  పని కూడా సెంట్రల్ కి అప్పచెప్పేసి బోలెడన్ని రోడ్లు , హైవే లను తీసుకువచ్చేస్తోంది. సాధారణ జనం మాత్రం ఇది మన నాయకుడే వేయించాడని భావిస్తారు. పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టే రోడ్లు వచ్చాయని.. లేదా మన జగన్ వచ్చాక వచ్చాయని చెప్పుకుంటారు..  అలా ఉంటాయి రాష్ట్రప్రభుత్వాల యొక్క తెలివితేటలు.  కానీ అసలు ఇవన్నీ  చేసే కేంద్ర ప్రభుత్వం  మన పత్రికల్లో  లేదా చానల్స్ లో కనిపించినా, వినిపించినా దాని పరిమాణం చిన్నగానే ఉంటుంది.


రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల పని మహా అయితే ఏడాదికి ఒక ఐదు వేల కోట్లు అయితే మెయిన్ హెడ్డింగ్స్ లో ఉంటుంది. అదే కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల రోడ్లు వేస్తున్నా... సాధారణ జనానికి తెలియదు.  కానీ కేంద్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: