తాను ప్యాకేజీ తీసుకున్నాను అన్న వాళ్ళని చెప్పుతో కొడతానని చెప్పు చూపించిన పవన్ కళ్యాణ్ తిరిగి రెండోసారి అది కాకతాళీయమో, యాదృచ్ఛికమో లేక అనుకునే జరిగిందో తెలియదు గాని మరోసారి పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు నాయుడుల సమావేశం ,రెండో మీటింగ్ జరిగింది. మొదట పవన్ కళ్యాణ్ వైజాగ్ నుంచి వచ్చాక విజయవాడలో నోవాటెల్ హోటల్ లో చెప్పు చూపించి మాట్లాడిన అర్థగంట తర్వాత వారి మొదటి సమావేశం జరిగింది. అడిగితే చంద్రబాబు నాయుడు గారు దారిలో ఇలా వచ్చారని చెప్పేసి అప్పుడు చెప్పడం కూడా జరిగింది.


కానీ ఈ రెండో సమావేశం మాత్రం  కాకతాళీయంగా కాకుండా అనుకునే జరిగిందని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని తన ఇంటికి పిలవడం, పవన్ కళ్యాణ్ అందుకు సమ్మతించి ఆయన ఇంటికి వెళ్లడం జరిగింది. ఇలా వీరి రెండో సమావేశం సుమారు రెండున్నర గంటల పాటు జరిగినట్టు సమాచారం. నడుస్తున్న ప్రచారాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబునాయుడుల మధ్య 35 సీట్లకు పొత్తు కుదిరిందని, నాలుగైదు సీట్లకు మాత్రం లెక్క తేలలేదని తెలుస్తుంది.


జనసేన అడుగుతున్న 30 సీట్ల గురించి ప్రచారం బయటకు వచ్చింది అందులో 24 అసెంబ్లీ  సీట్లకు సంబంధించిన వివరాల ప్రకారం విశాఖ నార్త్, చోడవరం, గాజువాక, భీమిలి, యలమంచిలి, రాజానగరం, అమలాపురం, రాజోలు, కాకినాడ రూరల్, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం కైకలూరు, ఇంకా విజయవాడ పశ్చిమ, తెనాలి, సత్తెనపల్లి గుంటూరు పశ్చిమ, పుట్టపర్తి, చీరాల, గిద్దలూరు, తిరుపతి, చిత్తూరు, దర్శి, అనంతపురం అర్బన్ అడుగుతున్నట్లుగా తెలుస్తుంది.


మొత్తం 35 సీట్లను  అడుగుతున్నట్టుగా తెలుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు 30 సీట్ల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే సమాజంలో ఏ విషయాన్ని అయినా అధికారంగా   తెలిసేంతవరకు నమ్మడానికి లేనటువంటి పరిస్థితి. చూద్దాం ఎంత నిజమవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: