
అయినా భాజపా అందుకు అంగీకరించకపోవచ్చని రాహుల్ గాంధీ అన్నారు. సోదరుడిగా అతన్ని కలిసి ఆలింగనం చేసుకుంటానని.. కానీ, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం వ్యతిరేకిస్తానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ మనవడు, భాజపా ఎంపీ వరుణ్ గాంధీ భాజపాలో కొనసాగుతున్నా.. ఇటీవల సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే వరుణ్ గాంధీ ..ఇటీవల కాంగ్రెస్‌లో చేరతారనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
సోదరుడిగా అతన్ని కలిసి ఆలింగనం చేసుకుంటా.. కానీ, ఆయన సిద్ధాంతాన్ని మాత్రం ఎన్నడూ సమర్థించనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తన కుటుంబానికో సిద్ధాంతం ఉందన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ... కానీ, వరుణ్ ఆరెస్సెస్ భావజాలాన్ని అలవరచుకున్నారని చెప్పారు. ఆరెస్సెస్ మంచి పని చేస్తోందని చాలా ఏళ్ల క్రితమే వరుణ్ తనకు చెప్పే ప్రయత్నం చేశాడని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు.
తాను తలనైనా తీసేసుకుంటా కానీ ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి వెళ్లనని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా పంజాబ్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర కాశ్మీర్‌తో ముగుస్తుంది. అయితే.. కొందరు మాత్రం రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ కలిస్తే బావుంటుందని సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక, వరుణ్ కలిసి పని చేయాలని ఆశిస్తున్నారు.