ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఉద్యోగాలు పోయి ఎంతోమంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారు. దీనికి కారణం ఒకపక్క రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూ ఉండడం, మరోపక్క గతంలో వచ్చిన కరోనా నాటి పరిస్థితులు కూడా ఒక కారణం.  ఇప్పుడిప్పుడే కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలని తుడిచేస్తూ ఎంతోమంది తమ జీవన విధానాన్ని మళ్లీ సాధారణ స్థాయిలో గడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా  ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చేలా కనిపిస్తుంది.


ముఖ్యంగా యూరప్ దేశాలు, బ్రిటన్ అమెరికాలో కొన్ని వేల మంది ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఆయా ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను పక్కన పెడుతున్నాయి.  లక్షల జీతం ఉన్న వారిని కూడా వద్దని అంటున్నాయి. ఇదే సమయంలో బ్రిటన్ లో అమెరికాలో ఉన్న భారతీయులు  కాస్త నిలదొక్కుకున్నట్టుగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే వారికి భారతదేశంలోని మూలాలు వారిలో ఉండే విధానం ఇంకా వారు మర్చిపోకపోవడమే. ఉద్యోగం చేసే సమయంలో అమెరికాలో గాని యూకేలో కానీ యూరప్ దేశాలకు సంబంధించిన వారు గానీ ఎంత ఎంత జీతం వచ్చినా దాన్ని అట్టే ఖర్చు పెట్టేయడం వారికి అలవాటు.


భవిష్యత్తులో ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందా వాటిని ఎలా పొదుపు చేయాలననే విషయాన్ని వారు మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి సమయం వచ్చినప్పుడు వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే సమయంలో బ్రిటన్ నుంచి ఒక భారతీయుడు వారి తల్లిదండ్రులకు రాసిన లేక వైరల్ గా మారింది. ఏమిటంటే మీరు నేర్పిన జీవన విధానంతో ఈరోజు ఇక్కడ ఉద్యోగాలు పోతున్నా కూడా మేము నిలదొక్కుకొని ఉంటున్నాం.


దానికి కారణం మీరు నేర్పిన పొదుపు మీరు చూపించిన మార్గం మన దేశంలో ఉన్నటువంటి విధానమే అని తల్లిదండ్రులకు కుమారుడు తన బాధని ఆవేదనని ఒక కరకమైన ఆనందాన్ని లేఖలో రాశాడు. అంటే పొదుపు అనేది ఎంత ముఖ్యమైనది ఇప్పుడు ఉద్యోగాలు పోతున్న వారిని అడిగితే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: