భారతదేశంలో మన నిత్య జీవితంలో వాడే వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయి, మళ్లీ గతంలో అంత ఎక్కువ కాకపోయినా కొంత వరకు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్య కందిపప్పు, మినప్పప్పు, మైదా పిండి, గోధుమపిండి, పెసరపప్పు, నూనెలు ఇలా మనకు అత్యవసరమైన సరుకుల ధరలు అమాంతం భారీగా పెరిగిపోయాయి. ధరలు అమాంతంగా పెరిగిపోయేసరికి మోడీ సర్కారు సరైన టైంలో నిర్ణయం తీసుకుని, పెరుగుతున్న ధరలకు కొంత కళ్ళెం వేసింది. దాంతో ధరలు కొంత తగ్గి  ఎనిమిది పాయింట్ ఒకటి ఉన్న ద్రవ్యోల్బణం 6.50 కి వచ్చింది. ఇప్పుడు అదే ద్రవ్యోల్బణం రేటు 5 వరకు వస్తుందని అంటున్నారు. అంటే ధరలు మనముందే క్రమంగా పెరిగి మోడీ గారు తీసుకున్న నిర్ణయంతో, మళ్లీ తగ్గుతూ వచ్చాయి.


అలాగే మనకు అత్యవసరమైన ఉల్లిపాయల రేట్లు అయితే అప్పట్లో వంద రూపాయలు దాకా వెళ్లి, తర్వాత తగ్గుతూ వచ్చాయి. అప్పటికి అక్కడ ఉల్లిపాయల రేట్లు పది రూపాయలు ఉంటే మనకి పాతిక రూపాయలు అమ్మే పరిస్థితి ఉంది ఇక్కడ. ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఎందుకంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం, ఇంకా ఉల్లిపాయల రేట్లు పెరగడం,ఆయిల్ రేట్లు తగ్గినా ఇదివరకటి ధరల కన్నా కొంత ఎక్కువ ఉండడం, అలా ధరలు పెరుగుదల మాత్రం కంటిన్యూ అవుతుంది.


అయితే గోధుమపిండి ధరల పెరుగుదల 40-45 రూపాయల దాకా వెళ్లి, ఇప్పుడు తాజాగా 29.50 రూపాయలకు తగ్గింది. ఇప్పుడు ఆ తగ్గిన ధరలకే కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వబోతుంది. ఈ నెల 6 నుండి గోధుమపిండి 29.50 రూపాయలకు ఇవ్వబోతున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఎన్.సి.ఈ.ఎఫ్ అవుట్ లెట్ ల ద్వారా ప్రజలకు దీన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఇదే గోధుమ పిండి ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీ లో కిలో 292 రూలు ఉంటే, పాకిస్తాన్ లోని పెషావర్ లాంటి ప్రాంతాల్లో  కిలో 300 నుండి 310 రూపాయల వరకూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: