రష్యా... అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ కి ఒక భయంకరమైన హెచ్చరికను జారీ చేసింది. మాపై ఆంక్షలు పెడతావ్, పెట్టిస్తావ్ మా దేశం మీదకి వచ్చేటువంటి వాళ్ళకి సహకరిస్తావు, ఉక్రెయిన్ కి తెర వెనకే కాదు తెర ముందే నిలబడతావు, మాతో డైరెక్ట్ గానే యుద్ధం చేయొచ్చు కదా ఎందుకు ఈ చాటుమాటు యుద్ధం, దమ్ముంటే ముందుకొచ్చి పోరాడు అని అంటుంది రష్యా అమెరికాతో. ఇలా రష్యా అమెరికా అధ్యక్షుడికి ఒక వార్నింగ్ ఇచ్చింది.


USA మొత్తం హైబ్రిడ్ యుద్ధాన్ని ప్రేరేపిస్తూనే, రష్యా కు చెందిన మాస్కో పై అణ్వాయుధ దేశాలను ప్రత్యక్ష యుద్దానికి ప్రేరేపిస్తుందని రష్యా విదేశాంగ మంత్రి ఒక బలమైన ప్రకటనలో చెప్పారు. రష్యాలో అణు తనిఖీల కోసం, మాస్కో అణు దళాలపై వాషింగ్టన్ డిమాండ్‌లు దాడులకు స్పష్టంగా సహాయపడతాయని రష్యా పార్లమెంటరీ పేర్కొంది. అణు తనిఖీలను అడ్డుకోవడం మరియు కొత్త ఒప్పందాన్ని ఉల్లంఘించడం వంటి U.S ఆరోపణలకు ప్రతిస్పందనగా రష్యా ఈ విధంగా ప్రత్యక్ష యుద్దపు హెచ్చరికను జారీ చేసింది.


అణ్వస్త్రాలను తగ్గించుకోవాలని ఒప్పందాలు నడుస్తూ ఉంటే ఆ ఒప్పందంలో భాగంగా ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో ఇద్దరి తరుపున ఒక బృందాన్ని పంపిద్దాం. మీరు మా దగ్గరికి పంపించండి, మేము మీ దగ్గరికి పంపిస్తామని అమెరికా రష్యా ని అడిగింది. దానికి బదులుగా రష్యా అమెరికాతో, యుద్ధం టైములో నీకెందుకు పంపిస్తాం, ఈ టైంలో నీకు పంపిస్తే నువ్వా స్థావరాలు తీసుకెళ్ళి ఉక్రెయిన్ కి చెప్పడానికా అని రష్యా అంది. ఒక పక్కన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇస్తున్నావ్, మరొక పక్క యుద్ధ విమానాలను ఇస్తున్నావ్, ఉక్రెయిన్ కు ముందు వెనకాల కూడా సహాయం చేస్తున్నావ్, నీ మాటలు నేనెందుకు వినాలి అన్నట్టుగా రష్యా అంటున్నది. నువ్వు మధ్యలో ఇలాంటి వ్యవహారాలు నడిపితే  తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవ్వాల్సి వస్తుంది అని రష్యా హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: