
తాజాగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో శాసనసభ, లోక్ సభల పునర్విభజనకు ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ సంబంధిత ప్రక్రియ చెల్లుబాటును ప్రశ్నిస్తూ వేసినటువంటి పిటిషన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏ.ఎస్ వోకాల్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. జమ్మూ కాశ్మీర్ ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజన చేయడం, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, పెండింగ్ లో ఉన్న పిటిషన్ ల మీదన తాజా తీర్పు ప్రభావం ఉండదని చెప్పింది. అది వేరు,ఇది వేరు అని చెప్పింది. నియోజకవర్గాల పునర్విభజన అనేది బిజెపికి అనుకూలంగా చేశారని ప్రతి పక్షాల ఆరోపణ.
2026 కన్నా ముందు దేశంలో ఎక్కడా నియోజక వర్గాల పునర్విభజన చేయడానికి ఉండదని, కాబట్టి ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం కింద చెల్లుబాటు అవ్వదని పిటిషనర్ లు అజియో అబ్దుల్ ఘని, మహమ్మద్ అయూబ్ మట్టో ఆరోపించారు. దేశం లో నియోజకవర్గాలు 1971 జనాభా లెక్క ప్రకారం చేశారని, 2026 వరకు దీన్ని మార్చడానికి లేదని వాదించారు. 2011లో పార్లమెంట్ లో ఆమోదం పొందిన జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం క్రింద డీలిమిటేషన్ ఏర్పాటు చేశామని ప్రభుత్వం వాదించింది. జమ్ము కాశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన గత ఏడాది మేలోనే పూర్తి అయ్యిందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.