అమెరికా వాళ్ళు వాళ్ళ ప్రభుత్వానికి, పార్లమెంట్ కి ఒక నివేదిక ఇచ్చారు. ఈ వేళ అమెరికా పరిస్థితి ఏంటంటే.. ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే నడి రోడ్డు పైన నిలబడే  పరిస్థితి. ఎందుకు అంటే ఉక్రెయిన్ కి పంపించిన ఆయుధాల కారణంగా వారి దగ్గర ఉన్న ఆయుధాలు చాలా వరకు అంటే 1/3 ఆయుధాలు వెళ్ళిపోయాయి. ఇంకొక 1/3 ఆయుధాలు పాతబడి పోయాయి‌. ఇంకొక వంతు మిగిలి ఉంది. దాంతో యుద్ధం కనుక జరిగితే అవతల రష్యా, చైనా, ఇరాన్, కలిసాయంటే పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్టే.  ఇలాంటి పరిస్థితిలో కొత్త కూటములు ఏర్పడితే మనకు ప్రమాదం అని వాళ్ళు అంటున్నారు.


అమెరికా రెచ్చ గొట్టిన యుద్ధం దానికి కారణం అని తెలుస్తుంది. డిలే ఆఫ్ ఎక్వైర్ వెపన్స్ అనేటువంటిది చాలా రోజుల నుండి జరుగుతుంది. అదే సందర్బంలో కాస్ట్ ఓవర్ రూల్  బాగా కనిపిస్తుంది. అంటే అమెరికా అవసరానికి మించి అప్పుల్లో ఉన్న పరిస్థితి. అలాగే సీరియస్ షార్టేజెస్ అనేకం ఉన్నాయి. ఇలా ఈ 3 పాయింట్స్ ని నివేదికలో పేర్కొన్నారు. ఉక్రెయిన్ కి తాజాగా అందిస్తున్న సాయం 31  ట్యాంకులు 1980లో తయారైన ఎం.ఐ అబ్రం ఇద్దామంటే ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయలేని పరిస్థితి. అది ఇచ్చినా ఉపయోగం ఉండదు, ఇవ్వకపోతే ఉక్రెయిన్ ఏడుస్తూ ఉంటుంది.


2000 సంవత్సరంలో తయారైన హైపర్ సోనిక్ మిస్సైల్స్ అమెరికా దగ్గర ఉన్నాయి. కానీ అవి అప్ గ్రేడేషన్ లో లేవు. వాటి తర్వాత జనరేషన్స్ రష్యా, చైనాల దగ్గరున్నాయి. ఈ విషయాన్ని కూడా నివేదిక తెలుపుతుంది. చైనా, రష్యావి అనేకం అప్ డేట్ అయ్యాయనే విషయం తెలుస్తుంది‌. అమెరికా పరిశోధనలకు కోట్లు కావాలన్నా ఇవ్వట్లేదు. ఫ్యూచర్ కం బ్యాక్ వెహికల్స్ ప్లాన్ లేదు. ఇలాంటి సందర్భంలో మిగిలిన దేశాలు అందరు కలిసి జట్టు కడితే పెద్ద ప్రమాదం అవుతుంది అనే విషయాన్ని నివేదిక చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA