వీపీ సింగ్, దేవెగౌడ, గుజ్రాల్, చంద్రశేఖర్, మన్మోహన్ లాంటి వాళ్లు ప్రధానిగా ఉండాలని అమెరికా, చైనా, యూరప్ దేశాలు ఇప్పుడు భావిస్తూ ఉంటాయన్న వాదన ఉంది. ఎందుకంటే ఆయా దేశాలు ఏం చెప్పినా సై అంటూ ముందుకెళ్లడమే తప్ప మన దేశానికి ఏదీ బాగుంటుందో, ఏదైతే మనకు పనికొస్తుందో చూసిన పాపాన పోలేదని చెబుతారు. ప్రస్తుతం ఇండియాలో స్థిరమైన ప్రభుత్వం ఉంది. బీజేపీకి పూర్తి స్థాయి ఆధిక్యం రావడంతో ఎవరితో పొత్తు లేకుండానే అధికారాన్ని చేపట్టింది. స్థిరమైన ప్రభుత్వం వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమవుతుంది.


నేపాల్ లో ఒకప్పుడు రాజు పరిపాలనలో ఉన్నప్పుడు పాలన చక్కగా సాగిందని చెప్పొచ్చు. తర్వాత ఒక పార్టీ పాలనలో కూడా బాగానే సాగింది. రాజు కుటుంబం హత్య అనంతరం నేపాల్ లో పూర్తిగా అస్థిర రాజకీయాలే నడుస్తున్నాయి. అక్కడ  కమ్యూనిస్టు పార్టీల పాలన నడుస్తోంది. చైనా ఆధిపత్యం నేపాల్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా చైనా ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. రెండు కమ్యూనిస్టు పార్టీల మధ్య 24 గంటల అస్థిర ప్రభుత్వమే సాగుతుంది. తాజాగా నేపాల్ లో ప్రచండ ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉంది.  


నేపాల్ లో ప్రస్తుతం నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత రామచంద్ర పాటియా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. దేశ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా 8 పార్టీలు ఆయనకు మద్దతు పలుకుతున్నాయి. ఏపీ శర్మ నేతృత్వంలో 5 పార్టీలు కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నాయి. నేపాల్ పార్లమెంట్ బలబలాల ప్రకారం.. 8 పార్టీల మద్దతు ప్రకటించిన పార్టీ, ఆ నాయకుడే వచ్చే ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.


ప్రచండ నిర్ణయంతో ఆగ్రహించిన ఆయా పార్టీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. నేషనల్ డెమొక్రటిక్ పార్టీ కూడా మద్దతు ఉపసంహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సంకీర్ణ  ప్రభుత్వాల రాకతో నేపాల ప్రజలకు పెద్దగా ఏ మాత్రం ప్రయోజనం ఉండదని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: