
సోషల్ మీడియాను మంచి కోసం వాడుకుంటే దానంతా మంచిది ప్రపంచంలో ఏదీ లేదని చెప్పొచ్చు. చదువు, తెలివి, మంచి, వ్యాయామం, యోగా, ఉద్యోగం, క్లాసులు, పాఠాలు, ఇలా ఒక్కటేమిటి ప్రపంచంలో చూడలేని, జీవితంలో వెళ్లలేని ప్రాంతాలను కూడా చూస్తున్నాం. ఎంజాయ్ చేస్తున్నాం. కానీ కొందరు ప్రబుద్దులు తమ పర్సనల్ లైఫ్ ను పబ్లిక్ గా వీడియోలు పెడుతూ నాశనం చేసుకుంటున్నారు.
ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో ఒకటి జరిగింది. 17 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల యువకుడు పస్ట్ నైట్ వీడియోను తీసుకున్నాడు. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అది ఈ కంటా అ కంటా వధువు తల్లి వద్దకు చేరింది. దీంతో వధువు తల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పెళ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
ఈ వింతైన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. చాలా రోజుల తర్వాత పోలీసులు విషయాన్ని బహిరంగ పర్చారు. సభ్య సమాజం తలదించుకునేలా తన వ్యక్తిగత జీవిత భాగస్వామితో కలిసి ఉన్న వీడియోను బయటకు ఎలా తీసుకురావాలనిపించిందో ఆ మూర్ఖుడికే తెలియాలి. జీవితంతో కొన్ని విషయాలను నలుగురి మధ్య మాట్లాడటానికే చాలా మంది ఇష్టపడరు. అలాంటిది పస్ట్ నైట్ చేసుకునే సమయంలో ఆ వీడియోను తీసి దాన్ని పదిమందికి పంపించడం అంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా దరిద్రం తగలడింది. దాన్ని భరించడమే కష్టం రా బాబు అనుకుంటే ఇలాంటి వీడియోలు తీసే ప్రబుద్ధులు కూడా తయారయ్యారు.