తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆమె ఈడి జాయింట్ డైరెక్టర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ముందస్తు అపాయింట్మెంట్లు మరియు కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు.


అంతే కాదు..  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ తీరుపై మండిపడ్డారు. హడావిడిగా దర్యాప్తు చేయడం ఏంటని ఈడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. ఇంత స్వల్ప కాలంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ఏంటో అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు పేరిట రాజకీయo చేస్తున్నట్లు కనిపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.


అసలు ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేది ఏమీ లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఒక సామాజిక కార్యకర్తగా ఒక వారం ముందే నా కార్యక్రమాలు ఖరారయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కాబట్టి 11వ తేదీన విచారణకు హాజరవుతానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  తెలియజేశారు. రాజకీయ కక్షలో భాగంగానే  ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతుందన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ... దేశ పౌరురాలిగా ఒక మహిళగా చట్టపరమైనటువంటి అన్ని హక్కులను తాను ఉపయోగించుకుంటానని తేల్చి చెప్పారు.


గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏంటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ప్రశ్నించారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. వీటన్నింటినీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖలో అడిగారు. గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటని ఈడికి రాసిన లేఖలో ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: