బంగ్లాదేశ్ లో టాప్ బ్రాండ్ల బట్టలు తయారవుతుంటాయి. అయితే గతంలో చైనా దేశం పత్తి కొని బంగ్లాలో బ్రాండ్ బట్టలను తయారు చేయించి వాటిని ప్రపంచ వ్యాప్తంగా సప్లై చేసేది. కానీ చైనాపై నిషేధం విధించాక పెద్ద పెద్ద కంపెనీలు బంగ్లాదేశ్ లో  కంపెనీలకు  మీరే చేయండి ఆ డబ్బులేవో మీకే ఇస్తామని బంగ్లాదేశీయులకు ఆఫర్ ఇచ్చాయి. దీంతో చైనా కంగుతింది.


బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కాస్త కుదట పడిందనే లోపు అక్కడ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 3 వేల బట్టల షాపులు అగ్నికి అహుతయ్యాయి. బంగా బజార్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో పెద్ద ఎత్తున వ్యాపారాలు నష్టపోయాయి. సైన్యం, ఎయిర్ పోర్స్ రంగంలోకి దిగి అగ్ని ప్రమాదాన్ని ఆపేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.


ఆర్మీ కూడా కంట్రోల్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఒక్కొక్క వ్యాపారి నెలకు దాదాపు 14 వేల డాలర్లు సంపాదిస్తారు. దాదాపు 65 పైరింజన్లలో అగ్ని ప్రమాదాన్ని ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టెక్స్ టైల్ మ్యాన్ పాక్చరింగ్  హబ్ లో సేప్టీ కి సంబంధించిన అంశాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.


20 సంవత్సరాల నుంచి లేని అగ్ని ప్రమాదాలు దాదాపు 2 సంవత్సరాల్లోనే జరుగుతున్నాయి. దాదాపు గతేడాదిలోనే రెండు లక్షల ఎనభై అయిదు వేల ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు నెలల్లోనే 24 వేల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల వెనక ఎవరిదైనా కుట్ర ఉందా.. లేక ఇన్సూరెన్స్ కోసం కావాలని చేస్తున్నారా, లేక చైనా ఏమైనా కుట్ర పన్నిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతోందంటే ఈ భారీ అగ్ని ప్రమాదం వారి ఆశల్ని అడియాసలు చేసేశాయి. ఈ ప్రమాదం నుంచి కోలుకుని మళ్లీ వస్త్ర వ్యాపారం రాణించాలంటే చాలా రోజులు పట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: