రష్యా కు భారత్ కు మధ్య సన్నిహత సంబంధాలు ఉన్నాయనే సంగతి తెలిసిన విషయమే. రష్యా తో స్నేహ సంబంధాల విషయంలో ఎప్పటికీ భారత్ వెనుకంజ వేయదు. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ ప్రారంభ సమయంలో భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయవద్దని యూరప్ దేశాలు, అమెరికా తీవ్రమైన ఒత్తిడి చేశాయి. కానీ రష్యాతో ఉన్న అనుబంధం కారణంగా ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి రష్యా నుంచే భారత్ ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. దీనితో పాటు అనేక  వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగుతోంది.


ప్రస్తుతం రష్యా నుంచి  అమెరికా కంపెనీలు వేలల్లో తరలిపోయాయి. యూరప్ దేశాల కంపెనీలు కూడా వెళ్లిపోయాయి. అయితే ఆయా స్థానాల్లో భారత్ పెట్టుబుడులు పెట్టేందుకు, నూతన కంపెనీలను ప్రవేశ పెట్టేందుకు ముందుకు సాగుతోంది. ఇదే తరహాలో చైనా, పాకిస్థాన్ నేతలు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే చైనా వారికి లాంగ్వేజ్ సమస్య ఎదురవుతోంది. చైనా ఎక్కువగా తమ సొంత భాషలోనే పనులను చక్కబెడతారు. ఇంగ్లీష్ రాకపోవడం వారికి పెద్ద సమస్యగా మారుతోంది.


అయితే ఈ మధ్య పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ రష్యా వెళ్లారు. ఆయిల్ ను అమ్మాలని రష్యా ను కోరారు. దీనికి రష్యా కూడా ఒప్పుకుంది. పాకిస్థాన్ తరఫున అప్గానిస్తాన్ గురించి మాట్లాడటానికి హీనా ఒక్కరే వెళ్లడంతో రష్యా విదేశాంగ మంత్రి అసహనానికి గురయ్యారు. విదేశాంగ మంత్రి ఒక్కరే వస్తే ఎలా చర్చలు జరిపేది. అప్గాన్ సమస్యలపై ఆర్మీ అధికారులు, ఇతర విదేశాంగ అధికారులు రాకుండా ఒక్కరితో ఎలా చర్చలు జరపగలం అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గోవ్ అన్నారు. పాకిస్థాన్ కూడా ఇప్పుడు రష్యాలో వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: