ప్రస్తుతం రాజకీయాల్లో అవినాష్ రెడ్డి గురించే టాపిక్ నడుస్తుంది. దాని పై నుండి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, అటెన్షన్ డైవర్షన్ పాయింట్ అటువైపు వర్గం వాళ్ళకి దొరికినట్లు తెలుస్తుంది. ఒక గీతను చిన్న గీతను చేయాలంటే దాని పక్కన దానికన్నా పెద్ద గీత గియ్యాలన్నట్లు అవినాష్ రెడ్డి వ్యవహారంపై అటెన్షన్ ను డైవర్ట్ చేసేందుకు రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్స్ సోదాలు చేయడం మొదలుపెట్టారని కొంతమంది అనుకుంటున్నారు.


ఈ వ్యవహారంపై కోర్టు చేసిన వ్యాఖ్యలను పత్రికలు వాళ్ళు వ్రాయాలంటే ఓన్లీ సాక్షి వాళ్ళు తప్ప ఎవరూ వ్రాయరని, మిగిలిన పత్రికలన్నీ పెద్దాయనకి సంఘీభావం తెలుపుతూ, వ్రాయలేరని కొందరు అంటున్నారు. కాబట్టి ఇదే సందర్భంలో మళ్లీ టాపిక్ డైవర్షన్ కోసం లేదా, అటెన్షన్ డైవర్షన్ కోసం, నిన్న జగన్ సంతబొమ్మాళి దగ్గరికి వెళ్లి మూలపాడు పోర్టు శంకుస్థాపనకు వెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజధాని టాపిక్ ని రైజ్ చేశారు. మొన్నటిదాకా  జూన్, జూలైలలో అన్నా, ఇప్పుడు సెప్టెంబర్ నుండి విశాఖలో ప్రభుత్వ కార్యకలాపాలు మొదలు పెడతామని ఆయన చెప్పారు‌.


ప్రజలందరూ కూడా విశాఖనే  రాజధానిగా కోరుకుంటున్నారని ఆయన అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుండి విశాఖకు షిఫ్ట్ అవుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ విశాఖ ఆమోదయోగ్యం అన్నటువంటి పాయింట్ ఆయన చెప్పుకొచ్చారు. మొన్న ఇదే పాయింట్ ని చెప్తే ఉత్తరాంధ్రలో ఓడిపోయింది. అదే సందర్భంలో రాయలసీమలో కూడా ఓడిపోయారు రెండు చోట్ల కూడా.


ఇలాంటి పరిస్థితుల్లో అంతకు ముందు స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అమరావతిని రెఫరెండం అంటే అది కూడా ఓడిపోయింది. మొన్న వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు విశాఖకు ఇది రెఫరెండం అని, కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఓడగొట్టారు. అయినా కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పడం వెనకాల ఉన్నది కేవలం అటెన్షన్ డైవర్షన్ గేమ్ మాత్రమే అని మరి కొంత మంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: