ప్రపంచంలో ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో వారు కొంచెం ఆస్ట్రేలియాలో లిటిల్ ఇండియా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఇండియాలో చైనా బజార్, లిటిల్ అమెరికా అని పిలిచే మనం ఆస్ట్రేలియాలో లిటిల్ ఇండియా అనే ప్రాంతం గురించి తెలుసుకోవాలి. అయితే ఏ దేశంలో నైనా  ఆయా వస్తువులు దొరికే ప్రాంతాలను అలా పిలవడం అలవాటై పోయింది.


వివిధ  దేశాల వస్తువులు దొరికే ప్రాంతాల్లో స్థానికులు అలా పిలుచుకుంటారు. అఫ్గానిస్తాన్ లో కూడా లిటిల్ అమెరికా అనే పేర్లతో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియాలో భాగంగా ఇండియాలో అనేక ప్రొడక్టులను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని విదేశాలకు కూడా ఎగుమతి చేసి ఇండియా పేరును విశ్వవ్యాప్తం చేస్తున్నారు.


ఆస్ట్రేలియాలో ప్రస్తుతం లిటిల్ ఇండియా అనే పేరు వినపించనుంది. ఆస్ట్రేలియా దేశం సిడ్నీలోని సబర్బ్ ప్రాంతంలో ఉండే హరిస్ పార్కు ప్రదేశంలో భారతీయులహోటళ్లు, పార్కులు, రెస్టారెంట్ లు ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కువ మంది భారతీయులు వారికిష్టమైన వంటకాలు తినేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువగా భారతీయులు తిరగాడే ఈ ప్రాంతానికి లిటిల్ ఇండియా పేరు పెట్టాలని కోరారు. దీనికి సిడ్నీ అడ్మినేష్ట్రన్ సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది.


ఇలా ఇండియా పేరు విదేశాల్లో ఒక ప్రాంతానికి పెట్టడం అనేది అరుదుగా జరిగే సంఘటన. స్థానికులు పిలుచుకునే దానికి అధికారికంగా పెట్టే పేరుకు ఎంతో తేడా ఉంటుంది. ఇండియాలో కూడా ఇలా చాలా ప్రాంతాలను వివిధ దేశాల పేర్లతో పిలుచుకుంటారు. ఎన్నో రకాల పేర్లు, హెటళ్లకు, ప్రాంతాలకు, ఇతర ప్లేస్ లకు పెడుతుంటారు. అవి ఆయా పేర్లతో ఫేమస్ అవుతూ ఉంటాయి.  దేశం ఏదైనా అక్కడ ఉండే ప్రజలు, వారు తీసుకునే ఆహారం, పర్యావరణ పరిస్థితులు అన్ని కలిసి కొత్త పేర్లను తీసుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: