ఉక్రెయిన్ కనుక రష్యా లోపలి భూభాగాలపై దాడి చేసినా, రష్యా ఇదివరకు ఆక్రమించుకున్న క్రిమియాపై దాడి చేసినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని యుద్ధం ప్రారంభంలోనే హెచ్చరించాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. మిలటరీ ఆపరేషన్ అని డిక్లేర్ చేసినప్పుడు ప్రపంచ దేశాలకు పుతిన్ ఒక గీత గీసాడు. ఆ గీత ఏంటంటే మేము యుద్ధం చేసేది మా వాళ్ళని కాపాడుకోవడం కోసమే, మా భాష మాట్లాడే వాళ్ళని బ్రతికించుకోవడం కోసం చేస్తున్న మిలటరీ ఆపరేషన్ ఎక్కువగా మా భాష మాట్లాడే వాళ్ళ ఎక్కువగా ఉండే ప్రాంతానికే పరిమితమవుతున్నామనేది.


మేము మా వాళ్ళని కాపాడుకోవడం కోసం చేస్తున్నాం కాబట్టి ఇది ఆత్మ రక్షణ కాబట్టి ఉక్రెయిన్ గాని ఇంక వేరే దేశం గాని ఏమైనా అట్టాక్స్ ప్లాన్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరిక చేసింది భయంతోనే అని అమెరికన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే బైడెన్ అయితే మూడో ప్రపంచ యుద్ధం  రాకుండా ఆపారని తెలుస్తుంది.


మొన్న ఫిబ్రవరి 24 కి యుద్ధం ప్రారంభమై ఏడాది గడిచిన సందర్భంగా యుద్ధ విమానాలను, డ్రోన్లను ఇంకా యుద్ధ మిస్సైళ్ళతో రష్యా రాజధాని  మాస్కో వైపు ఎంత కుదిరితే అంత దాడి చేస్తామని, అప్పుడు మేము పడే బాధ రష్యాకు తెలుస్తుంది అని చెప్పి ఉక్రెయిన్ అమెరికాతో చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఆలోచనను అమెరికా ఆపిందని తెలుస్తుంది.


ఎందుకంటే రష్యా లోపల భూభాగాలపై గాని ఉక్రెయిన్ దాడి చేస్తే రష్యాకి కోపం వచ్చి ఒక అణు బాంబు గాని ఉక్రెయిన్ మీద వేసింది అంటే దాని దెబ్బకి ఉక్రెయిన్ బూడిద అయిపోతుందని, పనిలో పని రష్యా పక్క దేశాలపై కూడా అదే అణుబాంబు దాడి చేస్తే కనుక అవి కూడా నాశనం అయిపోతాయి అని, అప్పుడు అమెరికా మరో నాలుగు ఆంక్షలు పెట్టడం తప్ప ఏమీ చేయలేదని ఆపినట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: