సొరస్ సంస్థ భారత్ లో కుట్రలు చేస్తోందని మొన్నటి వరకు చాలా వరకు వార్తలు వినిపించాయి. అదానీ విషయంలో ఇండియాలో షేర్ మార్కెట్లు కుప్ప కూలేలా చేసి భారత ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీయాలని ప్రయత్నించినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే అది వ్యాపార విషయం. అందులో ఇండియాకు చెందిన వ్యాపార దిగ్గజాన్ని దెబ్బతీయడమంటే భారత ఆర్థిక వ్యవస్థపై దాడి గా బీజేపీ పార్టీ నాయకులు అదానీని వెనకేసుకొచ్చారు. దీనికి చాలా మందే మద్దతు పలికారు.


ఈ సొరెస్ సంస్థ పంజాబ్ లో సిక్ ఫర్ జస్టిస్ అనే ఉగ్రవాద సంస్థ కు ఫండ్స్ అందజేస్తూ భారత్ లో అశాంతి చెలరేగడానికి కారణమవుతుందని ఆరోపణలు వచ్చాయి. దీన్ని కూడా చాలా వార్త సంస్థలు రాసుకొచ్చాయి.  సొరస్ అనే సంస్థ అమెరికాకు చెందినది కావడం. కావాలనే భారత ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తున్నట్లు అర్థం అయింది.


ప్రస్తుతం దేశంలో రెజ్లర్లు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆయన్ని వెంటనే తొలగించాలని నిరసన తెలియజేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. మాకు అన్యాయం జరుగుతోంది. ఆఫీసర్ ను తొలగించండి అని మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. దీనికి కూడా విదేశాల నుంచి కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేస్తోంది.


ఇది ఎంతవరకు నిజమో బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి. దేశ ప్రతిష్ట నిలబెట్టే బాక్సింగ్ క్రీడాకారులు విదేశీ శక్తులతో ఎందుకు చేతులు కలుపుతారు. వారి కష్టాలను తీర్చాలని ధర్నా చేస్తుంటే కనీసం బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదు.  ఒక వ్యక్తిని కాపాడుకోవడం కోసం బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తోందనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. పోనీ రెజ్లర్ల వెనక ఏ శక్తి ఉందో వారు చెప్పడం లేదు. కాబట్టి రెజ్లర్ల సమస్య తీర్చాలనే డిమాండ్ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: