ఎర్ర గంగిరెడ్డి వల్ల ఏపీ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు. ఎర్ర గంగిరెడ్డి లొంగుబాటుతో అసలైన కథ ఇప్పుడు మొదలైంది అని తెలుస్తుంది. అసలు ఎవరు ఈ హత్యకు పురిగొల్పారు అన్నది చెప్పగలిగే  ఏకైక వ్యక్తి ఇప్పుడు ఎర్ర గంగిరెడ్డి మాత్రమే అని తెలుస్తుంది. దీంట్లో దస్తగిరి అంత కి రోలు పోషించిన వ్యక్తి కాదని, అసలు వ్యక్తి ఎర్ర గంగిరెడ్డి మాత్రమేనని తెలుస్తుంది.


ఎర్ర గంగిరెడ్డి ఇప్పుడు జగన్ పేరు చెప్పినా, అవినాష్ రెడ్డి పేరు చెప్పినా రాజకీయం ఒకరకంగా ఉంటుందని, అదే చంద్రబాబు నాయుడు పేరు చెప్పినా, బీటెక్ రవి పేరు చెప్పినా, సునీత పేరు చెప్పినా మరో రకంగా రాజకీయ ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ వ్యక్తి బయటే ఉన్నాడు. ఎర్ర గంగిరెడ్డి మర్డర్ చేయించాడు, ప్రత్యక్షంగా మర్డర్లో పాల్గొన్నాడు అని ప్రత్యక్ష సాక్షి రంగయ్య చెప్పింది కూడా అదే. ఆ తర్వాత దర్యాప్తులో తేలింది కూడా అదే.


కానీ ఇక్కడ అసలైన ప్రశ్న ఎర్ర గంగిరెడ్డి తో ఎవరు చేయించారు అన్నదే. తనకు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదని కోపంతో చేయించాడని మొదట దస్తగిరి చెప్పితే, తన వెనుక ఎవరో ఉన్నారని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టుగా దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎర్ర గంగిరెడ్డి సిట్ టైంలోనే అరెస్ట్ అయినా డిఫాల్ట్ బెయిల్ తో బయటకు వచ్చి ఇప్పటి దాకా బయటే ఉన్నారు.


సిబిఐ విచారణలో ఏదీ స్పష్టత రాలేదు. ఇప్పుడు సిబిఐ అరెస్టు చేసి జైల్లో పెట్టి విచారణ చేయబోతుంది కాబట్టి ఆ తర్వాత జరగబోయే దానిమీద అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎర్రగంగి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మార్చబోయే కీలకమైన నిందితుడిగా కనిపిస్తున్నారు. ఇక వేచి చూడాలి అసలు గంగిరెడ్డి ఎవరి పేరు చెప్తారో రాజకీయం ఎలా మారబోతుందో అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: